వీడు మనిషేనా: తన కొడుకు ముందే తల్లిపై వ్యక్తి రేప్

By pratap reddyFirst Published 5, Sep 2018, 7:59 AM IST
Highlights

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బర్వానీ జిల్లా సురానీ గ్రామంలో 30 ఏళ్ల యువకుడు తన తల్లిపై అత్యాచారం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బర్వానీ జిల్లా సురానీ గ్రామంలో 30 ఏళ్ల యువకుడు తన తల్లిపై అత్యాచారం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

మహిళ రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా సెప్టెంబర్ 2వ తేదీన సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడు.  తన ముగ్గురు పిల్లలతో పాటు నిందితుడు తల్లిదండ్రులతో ఉంటున్నాడు. 

తల్లి ప్రతిఘటించడంతో నిందితుడు గొంతుపై కత్తి పెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి భార్య రెండేళ్ల క్రితం అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోియంది. 

నిందితుడి ఏడేళ్ల కుమారుడు తన నాయనమ్మపై తండ్రి అత్యాచారం చేస్తున్న ఘటనను చూస్తుండిపోయాడు. తల్లి అతని నుంచి తప్పించుకుని ముగ్గురు పిల్లలతో సమీపంలోని పొలాల్లోకి పారిపోయింది. 

మర్నాడు జరిగిన సంఘటనను బంధువులకు వివరించి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Last Updated 9, Sep 2018, 11:22 AM IST