యూపీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: భయాందోళనలో ప్రజలు(వీడియో)

By narsimha lodeFirst Published Sep 7, 2020, 8:12 PM IST
Highlights

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో ఇవాళ మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. న‌గ‌రంలోని సికంద్రా ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ఇప్ప‌టికే వ‌ర‌కు ఆ దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన‌ట్లు ఎట‌వంటి స‌మాచారం లేదని అధికారులు ప్రకటించారు.  

లక్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో ఇవాళ మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. న‌గ‌రంలోని సికంద్రా ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ఇప్ప‌టికే వ‌ర‌కు ఆ దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన‌ట్లు ఎట‌వంటి స‌మాచారం లేదని అధికారులు ప్రకటించారు.  

అగ్ని ప్ర‌మాదం జరిగిన ర‌సాయ‌నిక ఫ్యాక్ట‌రీ స‌మీపంలోనే కూర‌గాయ‌ల మార్కెట్ కూడా ఉంది.అయితే ఎగిసిప‌డుతున్న మంట‌ల్ని ఆర్పేందుకు అగ్నిమాప‌క ద‌ళాలు రంగంలోకి దిగాయి.  భారీ స్థాయిలో న‌ల్ల‌టి పొగ క‌మ్ముకొంది.. దీంతో స్థానిక ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. 

"

అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిన తర్వాత స్థానికులు ఫైరింజన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.

ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కెమికల్ వల్లే మంటలు వ్యాప్తి చెందినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో  పలు కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.  లాక్ డౌన్ తర్వాత ఫ్యాక్టరీలను తెరిచిన తర్వాత చాలా రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.

click me!