అల్బేనియాలో చిక్కుకున్న లక్నో వ్యాపారవేత్త.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టు.. ఆందోళనలో కుటుంబం

By team teluguFirst Published Oct 31, 2022, 11:20 AM IST
Highlights

లక్నోకు చెందిన వస్త్ర వ్యాపారి డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై అల్బేనియాలో అరెస్టు అయ్యారు. విదేశీ పర్యటనకు అని అక్కడి వెళ్లిన నిందితుడు అక్టోబర్ 18వ తేదీన ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. అయితే అతడు అరెస్టు అయ్యాడని ఓ ఇంగ్లీష్ వార్తా పత్రిక ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకొని షాక్ కు గురయ్యారు. 

లక్నోకు చెందిన 31 ఏళ్ల వ్యాపారవేత్తను డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో అల్బేనియాలో అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వ్యాపార వేత్త పేరు నితిన్ మిశ్రా. అయితే ఆయన అక్కడ చిక్కుకోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిశ్రాను పొరపాటున అరెస్టు చేశారని, ఎక్కడో తప్పు జరిగిందని, ఆయన వ్యాపార పర్యటనలో ఉన్నారని తెలిపారు. ఆయన డిజిటల్ మార్కెటింగ్ ద్వారా స్థానిక రెడీమేడ్ దుస్తులను ప్రోత్సహించాలనుకుంటున్నాడని పేర్కొన్నారు.

విషాదం.. భగత్ సింగ్ ఉరి సీన్ రిహార్సల్స్ చేస్తూ.. నిజంగానే ఉరేసుకున్న బాలుడు.. ఎక్కడంటే ?

అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) సమన్వయంతో అల్బేనియన్ అధికారులు అక్టోబర్ 21న రాజధాని టిరానాలో మిశ్రాను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’నివేదించింది. అతడిని యునైటెడ్ స్టేట్స్‌కు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన పోలీసుల రిమాండ్ కస్టడీలో ఉన్నారు. 

లక్నోలోని రాజాజీపురంలో ఉండే ఆయన కుటుంబం ఈ అరెస్టుతో షాక్ కు గురయ్యింది. ఆయన దుబాయ్ తరువాత అక్టోబర్ 12వ తేదీన అల్బేనియాకు వెళ్లాడని అక్టోబర్ 18 న తిరిగి రావాల్సి ఉందని చెప్పారు. అరెస్టు అయిన నితిన్ మిశ్రా కుటుంబాన్ని పోషించే ఏకైక వ్యక్తి అని, ఇది అతడి మొదటి విదేశీ పర్యటన అని తండ్రి ఆవేదనతో తెలిపారు. కుమారుడు అక్టోబర్ 18వ తేదీ వరకు టచ్ లో ఉన్నాడని, తరువాత అతడి నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదని పేర్కొన్నారు.

నిప్పుతో చెలగాటం చేస్తే ఇలానే ఉంటుంది.. వైరల్ వీడియో...!

బాధిత కుటుంబం మిశ్రా ఆచూకీ కోసం తీవ్రంగా వెతకడం ప్రారంభించింది. అయితే అక్టోబర్ 21వ తేదీన నితిన్ తన కుటుంబానికి ఫోన్ చేశాడు. డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై అధికారులు తనను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అయితే కాల్ మాట్లాడుతుండగానే కాల్ ఆకస్మాత్తుగా కట్ అయిపోయింది. చివరకు అల్బేనియన్ పోలీసులు అతడిని అరెస్టు చేసిన విషయం ఆ దేశానికి చెందిన ఇంగ్లీష్ వార్తా పత్రిక ద్వారా అక్టోబర్ 22వ తేదీన వారు తెలుసుకున్నారు. టిరానాకు 20 కిలోమీటర్ల దూరంలోని రినాస్‌లో 'డ్రగ్ ట్రాఫికింగ్' కారణంగా స్థానిక పోలీసులు నితిన్ మిశ్రాను అరెస్టు చేశారని  ఆ కథనం పేర్కొంది.

పామును కరిచిందని..వెంటాడి, పట్టుకుని కొరికి చంపేశాడు..

నిందితుడిపై యూఎస్ ఏజెన్సీ రెండు రెడ్ కార్నర్ నోటీసులు, రెండు అమెరికన్ అరెస్ట్ వారెంట్‌లను ఉదహరించినట్లు వార్తాపత్రిక నివేదిక పేర్కొంది. ‘మాదకద్రవ్యాల అక్రమ రవాణా క్రిమినల్ పని కోసం అంతర్జాతీయ శోధనలో అతడు ప్రకటించబడ్డాడు, ఇది క్రిమినల్ గ్రూప్ రూపంలో జరిగింది’ అని అల్బేనియన్ పోలీసులు తెలిపారని వార్తాపత్రిక పేర్కొంది. కాగా.. ఈ విషయంలో అల్బేనియా అధికారులు, ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయం తమను సంప్రదించలేదని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కేసులో జోక్యం చేసుకోవాలని ప్రధాని కార్యాలయానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

click me!