ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతాలు చేసేందుకు... 'హనుమాన్' వచ్చేస్తోంది 

By Arun Kumar P  |  First Published May 11, 2024, 10:42 AM IST

ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతాలు స‌ృష్టించే 'హనుమాన్' ప్లాట్ ఫారం ను భారతీయులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దీని తయారీ సంస్థ కీలక ప్రకటన చేసింది. 


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... భవిష్యత్ లో పెను మార్పులకు కారణమయ్యేలా కనిపిస్తున్న టెక్నాలజీ. ఇప్పటికే అనేక కంపనీలు ఏఐ ద్వారా సరికొత్త ఆవిష్కరణలు సృష్టిస్తున్నాయి. తాజాగా 3ఏఐ హోల్డింగ్ లిమిటెడ్ మరియు ఎస్ఎంఎల్ ఇండియా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు 'హనుమాన్'పేరుతో మార్కెట్ లోకి వస్తోంది. ప్రపంచంలోని 98 బాషలతో(12 భారతీయ బాషలు) కూడిన GenAI ప్లాట్ ఫారం హనుమాన్ ను రూపొందించినట్లు ప్రకటించారు. 

ఇలా సరికొత్తగా మార్కెట్ లోకి వస్తున్న ఈ ఏఐ వేదికను చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఫోన్ నంబర్ ను ఉపయోగించుకుని రిజిస్టర్ చేసుకుని దీన్ని వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దీన్ని టెక్ట్స్ చేస్తే రెస్పాన్స్ అయ్యేలా రూపొందించామని... దీన్ని మరింతగా అభివృద్ది చేసే ఆలోచన వుందని చెబుతున్నారు. 

Latest Videos

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా రూపొందించిన ఈ హనుమాన్ ప్లాట్ ఫారంను మార్కెట్ లోకి అగ్రెసివ్ గా తీసుకెళ్లడానికి తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మొదటి సంవత్సరంలోనే దాదాపు  200  మిలియన్స్ యూజర్స్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు.  ఈ క్రమంలోనే ఎస్ఎంఎల్ సంస్థ ప్రముఖ కంపనీలు హెచ్పి, నాస్కామ్, యోట్టాల భాగస్వామ్యంతో ముందుకు వెళుతోంది.  

తెలంగాణ ప్రభుత్వం, డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (DARPG) కూడా ఎస్ఎంఎల్ ఇండియా భాగస్యామ్యాన్ని ఏర్పాటుచేసుకుంది. ఇంగ్లీష్, తెలుగు మధ్య అనువాదంలో దోషాలు లేకుండా ఈ ఏఐ ప్లాట్ ఉపయోగపడనుంది. అలాగే హెల్త్, గవర్నెన్స్, ఫైనాన్సియల్ మరియు ఎడ్యుకేషన్ రంగాల్లో ఉపయోగపడేలా రూపొందిచారు. ఈ హనుమాన్ ప్రతి  భారతీయుడికి అందుబాటులో వుంటుందని 3ఏఐ హోల్డింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ ప్రసాద్ తెలిపారు. 

click me!