మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కు ఢిల్లీ కోర్టు షాక్

Published : May 10, 2024, 08:32 PM ISTUpdated : May 10, 2024, 08:33 PM IST
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కు ఢిల్లీ కోర్టు షాక్

సారాంశం

Brij Bhushan Singh in sexual harassment case : డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ సింగ్ తో పాటు మరో నిందితుడిపై పలువురు మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై అభియోగాలు నమోదు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

Brij Bhushan Singh in sexual harassment case : లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నాయ‌కుడు, డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పై అభియోగాలు నమోదు చేయాలని రూస్ అవెన్యూ కోర్టు శుక్రవారం ఆదేశించింది. అంత‌కుముందు ఆరుగురు మహిళా రెజ్లర్లు ఈ కేసును దాఖలు చేశారు. ఐదుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నేతపై కోర్టు అభియోగాలు మోపింది. అయితే ఆరో రెజ్లర్ చేసిన ఆరోపణల నుంచి బ్రిజ్ భూషణ్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. వమహిళల గౌరవానికి భంగం కలిగించిన నేరం కింద బ్రిజ్ భూషణ్ పై అభియోగాలు మోపారు. ఐదుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, మహిళల గౌరవానికి భంగం కలిగించిన నేరంతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవడానికి తగిన ఆధారాలు ఉన్నాయని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్ పుత్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బ్రిజ్ భూషణ్ పై 354, 354ఏ సెక్షన్ల కింద అభియోగాలు నమోదును కోర్టు పేర్కొంది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పై  కూడా అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. బ్రిజ్ భూషణ్ పై ఐపీసీ 354, 354 ఏ సెక్షన్ల కింద చర్యలు తీసుకునేందుకు తగిన సాక్ష్యాధారాలను కోర్టు గుర్తించింది. ఇద్దరు మహిళల ఆరోపణలపై సెక్షన్ 506 (పార్ట్ 1) కింద అతనిపై అభియోగాలు మోపారు. అయితే ఆరో రెజ్లర్ చేసిన ఆరోపణల నుంచి బ్రిజ్ భూషణ్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. రెండో నిందితుడు వినోద్ తోమర్ పై ఐపీసీ సెక్షన్ 506 (పార్ట్ 1) కింద ఒక మహిళ ఆరోపణపై అభియోగాలు మోపిన కోర్టు అతనిపై చేసిన మిగిలిన ఆరోపణలతో అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసును మే 21వ తేదీకి వాయిదా వేసింది.

కేఎల్ రాహుల్‌ను గ్రౌండ్‌లోనే తిట్టేసిన‌ లక్నో యజమాని

బ్రిజ్ భూషణ్, అతని సహచరుడు వినోద్ తోమర్‌పై ఢిల్లీ పోలీసులు గత ఏడాది జూన్‌లో ఆరుగురు మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధింపులకు గురిచేసి, దాడి చేసి, వెంబడించారనే ఆరోప‌ణ‌ల‌తో ఫిర్యాదును న‌మోదుచేశారు. తదనంతరం, 1,500 పేజీల ఛార్జ్ షీట్‌లో, బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలకు మద్దతుగా మహిళా రెజ్లర్లు, ఒక రిఫరీ, ఒక కోచ్, ఫిజియోథెరపిస్ట్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు చేర్చారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో, పైన పేర్కొన్న సెక్షన్ల క్రింద నేరాలు నమోదు చేయబడ్డాయి.

 

 

ఐపీఎల్ లో రికార్డుల మోత మోగిస్తున్న ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?
పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu