ఇరుపక్షాల పట్టు: శబరిమల వద్ద ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Oct 17, 2018, 11:27 AM IST
Highlights

కేరళ రాష్ట్రంలోని శబరిమలలోని ఆలయం సమీపంలో బుధవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని శబరిమలలోని ఆలయం సమీపంలో బుధవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తామని కేరళ సీఎం పినరయి విజయన్  స్పష్టం చేశారు. అయితే ఈ తీర్పును నిరసిస్తూ సంప్రదాయవాదులు  నిరసన వ్యక్తం చేస్తున్నారు.అయ్యప్పనామస్మరణ చేస్తూ  నిరసన తెలుపుతున్నారు.

శబరిమల ఆలయాన్ని ఇవాళ్టి నుండి ఐదు రోజుల పాటు  తెరవనున్నారు. అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం ఐదుగంటలకు ఆలయాన్ని  తెరవనున్నారు. ఐదు రోజుల పాటు  అయ్యప్ప భక్తుల కోసం ఆలయాన్ని  తెరిచి ఉంచుతారు.

సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలనే శబరిమల ఆలయంలోని మహిళలను  అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ  అఖిలభారత అయ్యప్ప అసోసియేషన్ సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

ఇదిలా ఉంటే సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ అంగీకరించలేదు. శబరిమల  ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తామని ఆయన ప్రకటించారు.

శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు  సామాజిక కార్యకర్త  తృప్తి దేశాయ్ నేతృత్వంలో  కొందరు హక్కుల కార్యకర్తలు, మహిళలు శబరిమల ఆలయ సమీపంలోకి చేరుకొన్నారు. 

మరోవైపు శబరిమల ఆలయానికి సమీపంలో శివసేన కార్యకర్తలు, హిందూ సంస్థల కార్యకర్తలు చేరుకొన్నారు. ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా అడ్డుకొంటామని హిందూ సంఘాలు, సంప్రదాయవాదులు ప్రకటించారు. ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే ఆత్మహత్య చేసుకొంటామని  శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. 

ఈ పరిణామలను దృష్టిలో ఉంచుకొని   శబరిమల ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.  నీలక్కల్ బేస్ క్యాంప్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంలోనే నిరసనకారులను పోలీసులు అడ్డుకొంటున్నారు. 

కాలానుగుణంగా సంప్రదాయాలు మారాల్సిందేనని సీఎం పినరయ్ విజయన్  స్పష్టం చేశారు.  శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే చూస్తూ ఊరుకొనేదీ లేదని సీఎం విజయన్ హెచ్చరించారు. సుప్రీం ఆదేశాలను పాటిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

శబరిమలలో యుద్ధమేనా... అడుగుపెట్టేందుకు, అడ్డుకునేందుకు రెడీ అయిన మహిళలు

శబరిమలకు వెళ్తా: ఫేస్‌బుక్‌లో మహిళా పోస్టు, హెచ్చరికలు

శబరిమల ఆలయంలోకి మహిళలు.. ‘‘స్టే’’కు సుప్రీం నో..!!

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం

శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల

శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

click me!