‘‘నాన్న.. నేను కిడ్నాప్ అయ్యాను’’ రూ.5 లక్షలు తీసుకురా..

By sivanagaprasad kodatiFirst Published Oct 17, 2018, 10:57 AM IST
Highlights

నాన్న నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు.. 5 లక్షలు డబ్బులిస్తేనే గానీ వదలరంటా అంటూ కొడుకు గొంతుతో ఫోన్ రావడంతో.. కంగారుపడిన తండ్రి పోలీసులను ఆశ్రయించగా అసలు బండారం బయటపడింది. 

నాన్న నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు.. 5 లక్షలు డబ్బులిస్తేనే గానీ వదలరంటా అంటూ కొడుకు గొంతుతో ఫోన్ రావడంతో.. కంగారుపడిన తండ్రి పోలీసులను ఆశ్రయించగా అసలు బండారం బయటపడింది.

నోయిడాలోని చిహ్‌జార్సీ ప్రాంతానికి చెందిన ఓ 11 ఏళ్ల బాలుడు తన కుటుంబంతో పాటు నివసిస్తున్నాడు. బాలుడి తండ్రికి కిరాణా షాపు ఉండటంతో తరచూ షాపులోని గళ్లాపెట్టె నుంచి డబ్బులు దొంగిలిస్తూ ఉండేవాడు. దీనిని గమనించిన తల్లిదండ్రులు గట్టిగా మందిలించారు.

అలాగే సోమవారం ఉదయం కూడా రూ.100 దొంగిలించడంతో బాలుడి... బాబాయ్ మరోసారి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు స్కూల్ అనంతరం గ్రేటర్ నోయిడాలోని బిస్రాక్ ప్రాంతానికి వెళ్లి కొద్దిసేపు గడిపాడు..ఈ సమయంలో అతని బుర్రకు ఓ ఉపాయం తట్టింది.

వెంటనే అక్కడున్న వ్యక్తి మొబైల్ ఫోన్ తీసుకుని తాను కిడ్నాప్ అయ్యానని... వెంటనే వచ్చి 5 లక్షలు ఇచ్చి కాపాడాలని తండ్రికి తెలిపాడు. దీంతో కంగారుపడిన ఆయన సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పాడు.

రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి తండ్రి ఫోన్‌కి వచ్చిన నెంబర్ ఆధారంగా కూపీ లాగడంతో అసలు వ్యవహారం తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా.. కౌన్సెలింగ్ అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. 

click me!