మహిళ నగ్న దేహం గురించిన పిటిషన్ పై కేరళ హైకోర్టు కీలక తీర్పు.. ఆ సందర్భాల్లో పై భాగం చూపడం అసభ్యత కాదు

By Mahesh KFirst Published Jun 5, 2023, 9:01 PM IST
Highlights

మహిళ నగ్న దేహానికి సంబంధించిన పిటిషన్‌లో కేరళ హైకోర్టు కీలక విషయాలను పేర్కొంది. పురుష, మహిళ నగ్న దేహాలపై సమాజంలో నెలకొని ఉన్న ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించింది. 
 

తిరువనంతపురం: మహిళ నగ్న దేహాన్ని చిత్రించడాన్ని అసభ్యతగా, సెక్సువల్‌గా చూడరాదని కేరళ హైకోర్టు తెలిపింది. ఓ మహిళ తన దేహం పై భాగం ఎలాంటి ఆచ్ఛాదనం లేకుండా ఉంచింది. తన పిల్లలో తన దేహంపై పెయింటింగ్ వేసే అవకాశం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో పై క్రిమినల్ కేసు ఫైల్ అయింది. ఈ కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మహిళ నగ్న దేహం గురించి సంచలన విషయాలు ప్రస్తావించింది.

మహళ దేహాల గురించి పురుషాధిక్య భావాలను సవాల్ చేయాలని, పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలని తాను భావించినట్టు ఆ తల్లి వాదించింది. అందుకే ఈ వీడియోను అసభ్యకరమైనదిగా చూడరాదని తెలిపింది. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకుంటూ పిటిషన్ డిస్మిస్ చేసి ఆ మహిళను విముక్తి చేసింది. 

ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక విషయాలను పేర్కొంది. ఏ సందర్భాన్నీ పరిగణనలోకి తీసుకోకుండా కేవలం మహిళ నగ్నం దేహం పై భాగం కనిపించిందని దాన్ని, సెక్సువల్‌‌గా చూడరాదని తెలిపింది. కాబట్టి, ఆమె నగ్న దేహాన్నిచిత్రించడం కూడా అసభ్యతగా, ఇండీసెంట్‌గా, సెక్సువల్‌గా భావించరాదని వివరించింది. వీటిని కేవలం ఆయా సందర్భాలను పరిశీలించిన తర్వాతే ఓ నిర్ధారణకు రావాలని సూచించింది.

Also Read: ‘ఈ రహస్యం నన్ను పీక్కుతింటున్నది’.. 15 ఏళ్ల కిందటి మర్డర్ కేసులో నేరాన్ని ఏడుస్తూ అంగీకరించిన నిందితుడు

సమాజంలో పురుష, మహిళ దేహాల పట్ల నెలకొని ఉన్న ద్వంద్వ ప్రమాణాలను కోర్టు ఈ సందర్భంగా ఎత్తిచూపింది. పిల్లలు తన బాడీని పెయింటింగ్‌కు కాన్వాస్‌గా ఉపయోగించుకోవడానికి తల్లి అనుమతించడంలో తప్పేమీ లేదని, అలాగే, పిల్లలను నగ్న దేహాలనూ సాధారణ చూపుతోనే చూడాలని ఆమె సెన్సిటైజ్ చేసిందని వివరించింది. ఆలయాల ప్రాంగణాల్లో విగ్రహాలు నగ్నంగా కనిపిస్తాయని, కానీ, వాటిని లైంగిక కోణంలో కాకుండా పవిత్రత కోణం నుంచి చూస్తామని పేర్కొంది.

పలు సంప్రదాయ పండుగలకు పురుషులు తమ నగ్న దేహాలపై పెయింటింగ్ వేసుకోవడాన్ని సాధారణంగా చూసిన వారు ఒక మహిళ అలా చేస్తే ఎందుకు వేలెత్తి చూపుతారని ప్రశ్నించింది. 

click me!