తమిళనాడుపై శబరిమల ప్రభావం: కేరళ హోటల్‌పై దాడి

By sivanagaprasad kodatiFirst Published Jan 3, 2019, 1:50 PM IST
Highlights

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఘటనతో కేరళ అట్టుడుకుతోంది. ప్రభుత్వమే దగ్గరుండి మహిళలతో దర్శనం చేయించిందని ఆరోపిస్తూ హిందుత్వ సంస్థలు కేరళలో బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. 

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఘటనతో కేరళ అట్టుడుకుతోంది. ప్రభుత్వమే దగ్గరుండి మహిళలతో దర్శనం చేయించిందని ఆరోపిస్తూ హిందుత్వ సంస్థలు కేరళలో బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో దీని ప్రభావం తమిళనాడును సైతం తాకింది. చెన్నై థౌజండ్ నైట్ గ్రీమ్స్‌రోడ్డులో గల హోటల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్థరాత్రి సమయంలో రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హోటల్ అద్దాలు, సెక్యూరిటీ చెక్‌పోస్ట్ ధ్వంసమయ్యాయి.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, తమిళనాడు వ్యాప్తంగా ఉన్న కేరళ ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పిస్తామన్నారు. శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన నేపథ్యంలోనే ఈ దాడి జరగివుండొచ్చని వారు భావిస్తున్నారు.

 

శబరిమలలోకి మహిళల ఆలయ ప్రవేశం.. సగం మీసంతో ఆందోళన

శబరిమల వివాదం.. ప్రధాన అర్చకుడికి చుక్కెదురు

శబరిమలలో మహిళల ప్రవేశం: అట్టుడుకుతున్న కేరళ

మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం

శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

click me!