మైసూరు గ్యాంగ్ రేప్: నిందితుల్లో ఒకరు మైనర్? ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

By telugu teamFirst Published Aug 28, 2021, 3:38 PM IST
Highlights

దేశవ్యాప్తంగా నిరసనలు రేపిన సామూహిక లైంగికదాడి కేసులను కర్ణాటక పోలీసులు చేజ్ చేశారు. మైసూరు రేప్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు చెప్పారు. అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరు మైనర్ అని అనుమానాలున్నాయి.
 

బెంగళూరు: దేశవ్యాప్తంగా కలకలం రేపిన మైసూరు గ్యాంగ్ రేప్ కేసును కర్ణాటక పోలీసులు ఎట్టకేలకు క్రాక్ చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు రాష్ట్ర డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. అరెస్టు చేసిన ఐదుగురు నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నట్టు సమాచారం.

మైసూరు శివారుల్లోని చాముండి హిల్స్ దగ్గర యూనివర్సిటీ విద్యార్థినిపై మంగళవారం రాత్రి గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమె బాయ్ ఫ్రెండ్‌ను చితకబాదిన దుండగులు 23ఏళ్ల ఎంబీఏ స్టూడెంట్‌పై లైంగికదాడికి పాల్పడ్డారు. ఇన్నాళ్లు ఆమె అపస్మారక స్థితిలోనే ఉండటంతో పోలీసులు వాంగ్మూలం తీసుకోవడం వీలుపడలేదు. ఫలితంగా నిందతులను గుర్తించడం కష్టంగానే మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హోం శాఖపై విమర్శలు వచ్చాయి. లైంగికదాడి జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి.

అరెస్టు చేసిన ఐదుగురు నిందితులు తమిళనాడు తిరుప్పూర్ జిల్లా నుంచి వచ్చిన వలస కార్మికులని పోలీసులు తెలిపారు. ఇందులో ఒకరు మైనర్ అని అనుమానిస్తున్నారు. ఓ నిందితుడికి 17ఏళ్లే ఉన్నట్టు డీజీపీ ప్రవీణ్ సూద్ చెప్పారు. కానీ, దీన్ని పరిశీలించాల్సి ఉన్నదని వివరించారు. ఇది సెన్సిటివ్ కేసు అని, తమ దగ్గర టెక్నికల్, సైంటిఫిక్ ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

click me!