బలపరీక్షలో ఓడిన కుమారస్వామి: కర్ణాటక సంకీర్ణం పతనం

By narsimha lodeFirst Published Jul 23, 2019, 7:40 PM IST
Highlights

కర్ణాటక అసెంబ్లీలో  కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణం ఓటమి పాలైంది. విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓటమిని మూటగట్టుకొన్నారు.
 

బెంగుళూరు: విశ్వాస పరీక్షలో కర్ణాటక సీఎం కుమారస్వామి ఓటమి పాలయ్యారు. మంగళవారం నాడు విశ్వాస పరీక్షపై అసెంబ్లీలో ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటింగ్ లో కుమారస్వామి ఓటమి పాలయ్యారు.

కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి, కుమారస్వామికి వ్యతిరేకంగా 105 ఓట్లు పడ్డాయి. కర్ణాటక అసెంబ్లీలో  204 మంది సభ్యులు ఉన్నారు. విశ్వాస పరీక్షలో స్పీకర్ రమేష్ కుమార్ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. 14 నెలల పాటు కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) ప్రభుత్వం అధికారంలో ఉంది.

2018 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప కూడ  అసెంబ్లీలో  బలనిరూపణకు ముందే రాజీనామాను సమర్పించారు. కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉన్న కారణంగానే కుమారస్వామి ప్రభుత్వం ఓటమి పాలైంది. జెడి(ఎస్)కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడ రెబెల్స్ తో జత కట్టారు. 

జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు  సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా అసెంబ్లీలో ఓటు వేస్తే  కుమారస్వామి ప్రభుత్వం  గట్టెక్కి ఉండేది. అసెంబ్లీకి 20 మంది ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడం వల్ల మ్యాజిక్ ఫిగర్ 103కు పడిపోయింది.

గతంలో సంకీర్ణ సర్కార్ కు మద్దతు ఇచ్చిన ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడ బీజేపీకి మద్దతును ప్రకటించారు. ఈ పరిణామాలు కూడ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాయి.కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య నెలకొన్న విభేదాలు పరోక్షంగా బీజేపీ విజయానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

 

కర్ణాటక అసెంబ్లీ లైవ్ : సోనియాగాంధీ కోరితేనే సీఎం అయ్యానన్న కుమారస్వామి

కర్ణాటక క్రైసిస్: అపార్టుమెంటు వద్ద ఆందోళన, చూడండి (వీడియో)

కర్ణాటక క్రైసిస్: ఇద్దరు ఎమ్మెల్యేల కోసం బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

కర్ణాటక సంక్షోభం: బెంగళూరులో 144వ సెక్షన్, వైన్ షాపులు బంద్

కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష

కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

నా రాజీనామా నాజేబులోనే ఉంది, లేఖ చూపిస్తూ కీలక వ్యాఖ్యలు

బీజేపీలా కొనుగోలు చేయలేదు, మావాళ్లే వెన్నుపోటు పొడిచారు: కుమారస్వామి

 

click me!