భారత్ లో వాట్సాప్ ని బ్యాన్ చేస్తున్నారా..?

First Published Jun 13, 2018, 11:57 AM IST
Highlights


ప్రభుత్వం ఈ ప్లాన్ లో ఉందా..?

ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ గురించి తెలియని వాళ్లు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ.. వాట్సాప్ వాడుతున్నారు. ఉదయం లేవగానే చాలా మంది ఫోన్ లో వాట్సాప్ చూసుకుంటూ ఉంటారు. అంతగా జనాలను ఆకర్షిన వాట్సాప్ ని భారత ప్రభుత్వం బ్యాన్ చేయాలని అనుకుంటోందా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.

సామాన్య ప్రజానీకంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులు కూడా వాట్సాప్ ని విచ్చలవిడిగా వాడడం వలన, ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు వాట్సప్ వేదికగా మారుతోంది. కాగా.. దీనిపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం వాట్సాప్ ని బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 ఇటీవల  కేంద్ర హోం శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించిన అధికారులు, వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలు, పోలీస్ శాఖ తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనిలో పలు విషయాలను చర్చించారు.

ముఖ్యంగా సంఘ వ్యతిరేక శక్తులు వాట్సాప్ ద్వారా  ద్వారా చాలా సులభంగా తమ కార్యకలాపాలను ఆచరణలో పెట్టటం పట్ల  అధికారులు  ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్లోని ఆర్మీ క్యాంపు మీద జరిగిన దాడి వాట్సప్ కమ్యూనికేషన్ ద్వారానే పూర్తి చేసిన విషయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు. అధికశాతం దేశ వ్యతిరేక శక్తులు వాట్సాప్ ని తమ కమ్యూనికేషన్ కోసం ప్రధాన మీడియంగా వాడుకుంటున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

కొన్ని మధ్య ప్రాచ్య దేశాల్లో మాదిరిగా వాట్సాప్ ని పూర్తిగా నిషేధించడం గానీ, లేదా వాట్సప్ వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాలను నిషేధించడం గానీ చేస్తే మేలనే అభిప్రాయానికి ఈ సమావేశంలో అధికశాతం మంది అధికారులు వచ్చారు.

కాగా.. ప్రజలు ఇప్పటికీ వాట్సాప్ కి విపరీతంగా ఎడిక్ట్ అయ్యారు. ఇలాంటి సమయంలో బ్యాన్ చేస్తే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

click me!