Search results - 294 Results
 • electric

  cars19, Feb 2019, 10:21 AM IST

  ఎలక్ట్రిక్ వాహనం కొన్నవారికి రూ.50 వేల డిస్కౌంట్

  విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్రం పలు రాయితీలు ప్రకటిస్తోంది. పన్ను రాయితీలతోపాటు రూ.50 వేల వరకు రిబేల్ అందిస్తోంది. 
   

 • arun

  business19, Feb 2019, 10:17 AM IST

  పంతం చెల్లించుకున్న కేంద్రం.. ఆర్బీఐ నుంచి రూ.28 వేల కోట్ల డివిడెండ్

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు తీర్చుకునేందుకు కేంద్రం అనుసరించిన వ్యూహం ఫలించినట్లే కనిపిస్తున్నది. ఇందుకు కేంద్రానికి రూ.28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ అందజేయనున్నట్లు ప్రకటించడమే కారణం. ఆర్బీఐలో మిగులు నిధుల అంశంపైనే గతేడాది డిసెంబర్ నెలలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాచేశారు.

 • Govt Jobs13, Feb 2019, 9:06 PM IST

  నిరుద్యోగుల ఎదురుచూపులకు తెర... 2,528 ఉద్యోగాలకు తుది ఫలితాలు విడుదల

  వివిధ కారణాలతో గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల తుది ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ (సోషల్ మీడియా తెలుగు మీడియం), గురుకుల టీజిటి పోస్టుల కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ విడుదలచేసింది. ఇలా ఒకేరోజు మొత్తంగా 2,528 ఉద్యోగాల తుది ఫలితాలను టీఎస్‌పిఎస్సి విడుదల చేసింది. 

 • bb patil

  Telangana12, Feb 2019, 4:14 PM IST

  శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలి: టీఆర్ఎస్ ఎంపీ డిమాండ్

  అనారోగ్యంతో ఇటీవలే తుదిశ్వాస విడిచిన శ్రీసిద్దగంగ మఠాధిపతి  శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆద్యాత్మిక గురువు, సామాజిక సేవకులైన శివకుమారస్వామి భారతరత్న ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తరువాత చాలా మంది రాజకీయ నాయకులు, ఆద్యాత్మికవేత్తలు కూడా కుమార స్వామి ప్రతిపాదనకు మద్దతు పలికారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా లోక్ సభలో ఈ అంశంపై ప్రసంగించారు. 

 • vandemataram express

  business12, Feb 2019, 3:26 PM IST

  ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న వందేమాతరం ఎక్స్‌ప్రెస్ రైలు...ప్రారంభానికి ముందే

  ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ప్రారంభమైన మేకిన్ ఇండియాలో భాగంగా రూపుదిద్దుకుని ఈ నెల 15న పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులకు చుక్కలు చూపనున్నది. ఎనిమిది గంటల్లో ఢిల్లీ నుంచి వారణాసి చేరుకునే ఈ రైలు టిక్కెట్ ధరలు చుక్కలనంటుతున్నాయి. అలాగే భోజనాది తదితర వసతుల ధరలు అలాగే ఉన్నాయి. 

 • modi

  business11, Feb 2019, 11:37 AM IST

  భారత్ ఎగుమతులపై జీరో టారిఫ్‌కు చెల్లు: రూ.40 వేల కోట్ల లాస్?

  ఇప్పటివరకు చైనా ఎగుమతులపై కొరడా ఝుళిపించి వాణిజ్య యుద్ధానికి తెర తీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా భారత్ ఎగుమతులపై కేంద్రీకరించారు. జీఎస్పీ కింద భారతదేశానికి 48 ఏళ్లుగా అమలవుతున్న జీరో టారిఫ్ రాయితీలను ఎత్తివేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు అనధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.

 • market

  business11, Feb 2019, 10:36 AM IST

  రోడ్లమీద అమ్ముకుంటున్నారా.. మీకు గుడ్‌న్యూస్, త్వరలో షాపింగ్ లైసెన్స్..?

  దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వీధుల్లో బండ్లపై వ్యాపారాలు నడిపే వారికి మంచి రోజులు రానున్నాయి. వీధి వ్యాపారులుగా వారికి లైసెన్సులు మంజూరు చేయడంతోపాటు ఇతర వసతులను కల్పించడానికి కేంద్ర గ్రుహ నిర్మాణ పట్టణాభివ్రుద్ధి శాఖ రంగం సిద్ధం చేస్తోంది. 

 • chandrababu naidu

  Andhra Pradesh10, Feb 2019, 5:34 PM IST

  ఏపీకి ప్రత్యేక హోదా: 11న ఢిల్లీలో బాబు ధర్నా

   ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద 12 గంటల పాటు ధర్నా నిర్వహించనున్నారు.

   

 • chandrababu

  Andhra Pradesh8, Feb 2019, 8:08 PM IST

  చివరి క్యాబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు (ఫోటోలు)

  చివరి క్యాబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు  

 • agrigold

  Andhra Pradesh8, Feb 2019, 7:31 AM IST

  అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్..10 వేల లోపు డిపాజిట్లను చెల్లించనున్న ప్రభుత్వం

  అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు కేటాయించింది. 

 • lokpal

  NATIONAL7, Feb 2019, 10:22 AM IST

  లోక్‌పాల్‌ ప్రక్రియను ప్రారంభించిన కేంద్రం, లోక్‌పాల్ అర్హతలివే..!!

  ప్రముఖ సామాజికవేత్త, గాంధేయవాది అన్నాహజారే ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. కేంద్రంలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని తన చిరకాల స్వప్పాన్ని నెరవేర్చుకున్నారు. లోక్‌పాల్‌ను నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. లోక్‌పాల్ నియామక ప్రక్రియకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 

 • trs mlcs

  Telangana5, Feb 2019, 8:16 PM IST

  ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్సీలకు సీఎం హామీ

  రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో  ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి(శాసన మండలి చీఫ్ విప్ ),కాటేపల్లి జనార్దన్ రెడ్డి ,పూల రవీందర్ ‌లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

 • Andhra Pradesh5, Feb 2019, 2:52 PM IST

  ఏపీ బడ్జెట్ 2019: ఓట్ల కోసం తాయిలాలు

  త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఏపీ సర్కార్ తాయిలాలను ప్రకటించింది. కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఉద్యోగులకు, రైతులకు, మహిళ సంఘాలకు వరాలను ఇచ్చింది. కాపులకు బడ్జెట్‌లో పెద్దపీట వేసింది.

   

 • yanamala ramakrishnudu

  Andhra Pradesh5, Feb 2019, 1:25 PM IST

  ఏపీ బడ్జెట్ 2019: కాపులకు పెద్దపీట, రూ.1000 కోట్లు

   త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున  బడ్జెట్‌లో కాపులకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో  వెయ్యి కోట్లను  కేటాయిస్తూ నిర్ణయం తీసుకొంది.

   

 • yanamala ramakrishnudu

  Andhra Pradesh5, Feb 2019, 12:39 PM IST

  ఏపీ బడ్జెట్ 2019: బీసీలు టార్గెట్, అన్ని కులాలకు కార్పోరేషన్లు


  రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల కార్పోరేషన్లకు రూ. 3 వేల కోట్లను కేటాయించినట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఇదే సమయంలో  అన్ని బీసీ కులాలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. జనాభా దామాషా ప్రకారంగా బడ్జెట్‌ను పంపిణీ చేయనున్నట్టు ఆయన చెప్పారు.