పహల్గాం ఉగ్రదాడి జరిగిన దాదాపు రెండు వారాల తర్వాత, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉగ్ర స్థావరాలపై భారత్ లక్ష్యంగా ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించింది. బుధవారం అర్థరాత్రి తర్వాత ఈ దాడులు చేపట్టింది. భారత సైన్యం మురీద్కే, కోట్‌లి, ముజఫర్‌అబాద్, బహావల్పూర్ ప్రాంతాల్లో ఉన్న నాలుగు ప్రధాన ఉగ్ర కేంద్రాలపై దాడులు నిర్వహించింది. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరులు, ఒక నేపాల్ జాతీయుడు మృతి చెందడం భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా కలచివేసింది. దీంతో ఉగ్రవాదంపై పోరులో భారత్ వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. సైనిక వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలు, లాంచ్‌ప్యాడ్లను ధ్వంసం చేయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం.

10:32 AM (IST) May 07
ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ జరిపిన దాడులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు హైదరాబాద్ లో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసారు.
10:31 AM (IST) May 07
ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్థానీ యువకుడు ISI, సైన్యం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ ఏజెన్సీలు నిద్రపోతున్నాయా అని ప్రశ్నించాడు. భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో యువకుడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
07:35 AM (IST) May 07
పాకిస్థాన్ లో అంతర్గత అలజడి రేగుతుందని.. ఆ దేశం రెండుగా విడిపోతుందంటూ సీనియర్ బిజెపి నేత కవిందర్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. భారత ఆర్మీ 'ఆపరేషన్ సింధూర్' తర్వాత పాక్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన అన్నారు.
పూర్తి కథనం చదవండి
07:01 AM (IST) May 07
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రెండు వారాల తర్వాత, భారత్ ఉగ్రవాద స్థావరాలపై భారీ ప్రతీకార చర్యలు తీసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు ప్రధాన ఉగ్ర స్థావరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది.
06:34 AM (IST) May 07
ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల అంతానికి భారత్ స్పందిస్తే పాకిస్థాన్ మాత్రం వంకర బుద్ధిని చూపింది. సామాన్యులపై దాడికి దిగింది పాక్ ఆర్మీ.
05:50 AM (IST) May 07
‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో జరిగిన ఈ దాడిలో బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్, మురిద్కేలోని లష్కర్-ఎ-తోయిబా ఉగ్ర నాయకులను హతమార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పూర్తి కథనం చదవండి05:25 AM (IST) May 07
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. పలు రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ భారత సైన్యానికి మద్దతు తెలిపారు.
04:55 AM (IST) May 07
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణి దాడులు చేసింది. పాకిస్తాన్ తీవ్ర ప్రతిస్పందన ఇస్తుందని చెప్పింది. సరిహద్దులో కాల్పులు కొనసాగుతున్నాయి.
పూర్తి కథనం చదవండి04:39 AM (IST) May 07
భారత్ మెరుపుదాడులకు సంబంధించి పాకిస్థాన్ స్పందించింది. పాక్ సైన్యాధికారితో పాటు ప్రధాని సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. ప్రధాని మరికాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
04:19 AM (IST) May 07
ఉగ్రవాదంపై ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేసింది. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ అధికారికంగా ధృవీకరించింది. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వెల్లడించింది.
03:56 AM (IST) May 07
Operation Sindoor:పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ దాడులు పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా జరిగాయని చెప్పారు.
03:56 AM (IST) May 07
పాకిస్థాన్ పై భారత్ జరిపిన దాడులను ఆ దేశం ధృవీకరించింది. వెంటనే దేశంలోని పలు విమానాశ్రాయాలను మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
03:47 AM (IST) May 07
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ PoK లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
03:47 AM (IST) May 07
పాకిస్తాన్ భూభాగంలో భారత క్షిపణి దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స్పందించారు. ఈ పరిణామం ఊహించినదేనని, శత్రుత్వాలను త్వరగా ముగించాలని కోరారు.
03:46 AM (IST) May 07
ఆపరేషన్ సింధూర్: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారతదేశం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.