India Pakistan war: సెలవులన్నీ క్యాన్సిల్.. అందరూ పనిచేయాల్సిందే. కేంద్రం ఆదేశాలు

Published : May 09, 2025, 11:51 PM ISTUpdated : May 09, 2025, 11:53 PM IST
India Pakistan war: సెలవులన్నీ క్యాన్సిల్.. అందరూ పనిచేయాల్సిందే. కేంద్రం ఆదేశాలు

సారాంశం

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అన్ని ప్రాంతాలలో ఆరోగ్య సేవలు, అత్యవసర ప్రతిస్పందనలు అంతరాయం లేకుండా కొనసాగేలా చూస్తోంది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం అన్ని ఆరోగ్య శాఖ అధికారుల సెలవులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేసింది. "ఉన్న పరిస్థితుల దృష్ట్యా, వైద్య కారణాలతో తప్ప, ఏ అధికారికీ ఎలాంటి సెలవులు మంజూరు చేయవని పేర్కొంది. ఇప్పటికే మంజూరు చేసిన సెలవులు కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెలవులో ఉన్న అధికారులు వెంటనే విధుల్లో చేరాలి" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 

కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా అత్యవసర ఆరోగ్య వ్యవస్థల సంసిద్ధతను సమీక్షించడానికి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి వైద్య సంసిద్ధత ప్రస్తుత స్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. అంబులెన్స్‌లను మోహరించడం, మందులు, పరికరాలు, రక్తం వంటి వైద్య సామాగ్రి లభ్యతను నిర్ధారించడం, ఆసుపత్రుల సంసిద్ధత, BHISHM క్యూబ్‌లు, మొబైల్ ట్రామా కేర్ యూనిట్‌ల మోహరింపు వంటి చర్యల గురించి ఆయనకు తెలియజేశారు.

ఆసుపత్రులు, వైద్య సంస్థలు అవసరమైన మందులు, రక్తం, ఆక్సిజన్, ట్రామా కేర్ కిట్‌ల లభ్యతను నిర్ధారించుకోవాలని సూచించారు. AIIMS న్యూఢిల్లీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులు, నర్సులను సామాగ్రితో సిద్ధంగా ఉంచాయి. రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలతో, సాయుధ దళాలతో, వైద్యులు, నర్సులు, పారామెడిక్స్, ప్రైవేట్ ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవాలని వారికి సూచించారు.

దేశవ్యాప్తంగా AIIMS, PGIMER, JIPMER, ఇతర ప్రధాన ఆసుపత్రులలో విపత్తు సంసిద్ధత కోసం మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అన్ని ప్రాంతాలలో ఆరోగ్య సేవలు, అత్యవసర ప్రతిస్పందనలు అంతరాయం లేకుండా కొనసాగేలా చూస్తోంది.

ఇదిలా ఉంటే మే 8, 9 తేదీల్లో పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. "పాకిస్తాన్ సాయుధ దళాలు పశ్చిమ సరిహద్దులో డ్రోన్‌లు, ఇతర ఆయుధాలతో దాడులు చేశాయి. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. డ్రోన్ దాడులను తిప్పికొట్టాం. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు తగిన ప్రతిస్పందన ఇచ్చాం. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి భారత సైన్యం కట్టుబడి ఉంది. దుష్ట చర్యలన్నింటికీ బలంగా ప్రతిస్పందిస్తాం" అని భారత సైన్యం తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !