India Pakistan War: పాక్ రక్షణ మంత్రి పిచ్చి మాటలు.. ఇండియా ఒంటరిగా మారిందంటూ

Published : May 09, 2025, 11:23 PM IST
India Pakistan War: పాక్ రక్షణ మంత్రి పిచ్చి మాటలు.. ఇండియా ఒంటరిగా మారిందంటూ

సారాంశం

పాకిస్తాన్ రక్షణా మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్, ఇండియా ఒంటరిగా ఉందని, ఇజ్రాయెల్‌తో కలిసి ఇస్లాంకి వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. పాకిస్తాన్‌కి చాలా దేశాల మద్దతు ఉందని చెప్పుకున్నారు.

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ నాయకులు వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, పాకిస్తాన్ రక్షణా మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ పార్లమెంటులో మాట్లాడుతూ.. ఇండియా ఒంటరి అయిపోయిందని, ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్‌కి మద్దతుగా ఉన్నాయని అన్నారు. అంతేకాదు, ఇండియా, ఇజ్రాయెల్ ఇస్లాం శత్రువులని విషం చిమ్మారు.

ప్రపంచం మొత్తం పాకిస్తాన్‌తోనే:

ఖవాజా ఆసిఫ్, గల్ఫ్ దేశాలు, ఇరాన్, చైనా, టర్కీ, అజర్‌బైజాన్ వంటి దేశాల మద్దతు పాకిస్తాన్‌కి ఉందని చెప్పారు. 'మేము యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, చైనాతో నిరంతరం సంప్రదిస్తున్నాం. ఐక్యరాజ్యసమితిలో మా ప్రతినిధులు ఇండియాకి బలంగా సమాధానం చెబుతున్నారు' అని అన్నారు.

ఇండియాతో ఇజ్రాయెల్ మాత్రమే

ఇండియాకి ఇజ్రాయెల్ మద్దతు మాత్రమే ఉందని ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఇజ్రాయెల్, ఇండియా ఇస్లాం శత్రువులని, ముస్లిం దేశాలపై ద్వేషంతో ఉన్నాయని ఆరోపించారు. టర్కీ, చైనా, అజర్‌బైజాన్ పాకిస్తాన్‌కి బహిరంగంగా మద్దతు ప్రకటించాయని చెప్పారు. 

 నిజానికి చాలా దేశాలు ఉగ్రవాద నిరోధక పోరాటంలో ఇండియాకి మద్దతు ఇస్తున్నాయి. పాకిస్తాన్ మాత్రం దీనికి విరుద్ధంగా అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పార్లమెంటులో రిజుజు Vs ఖర్గే | Kiren Rijiju vs Mallikarjun Kharge in Rajya Sabha
Most Liveable Cities 2026: వరల్డ్ బెస్ట్ సిటీ ఏదో తెలుసా? ఇండియా, పాకిస్థాన్‌ నగరాల ర్యాంకులు ఇవే