ఆటో డ్రైవర్ గా మారిన ప్రభుత్వ వైద్యుడు: వేధింపులే కారణమా?

By narsimha lodeFirst Published Sep 8, 2020, 3:27 PM IST
Highlights

 ఉన్నతాధికారుల స్వార్ధానికి ఓ ప్రభుత్వ డాక్టర్ ఆటో డ్రైవర్ గా మారాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.కరోనా సమయంలో వైద్యులు అందుబాటులో లేరని చెబుతున్నారు. 53 ఏళ్ల చిన్న పిల్లల వైద్య నిపుణుడు ప్రస్తుతం తన వృత్తిని వదిలి ఆటో రిక్షాను నడుపుకొంటున్నాడు.

బెంగుళూరు: ఉన్నతాధికారుల స్వార్ధానికి ఓ ప్రభుత్వ డాక్టర్ ఆటో డ్రైవర్ గా మారాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.కరోనా సమయంలో వైద్యులు అందుబాటులో లేరని చెబుతున్నారు. 53 ఏళ్ల చిన్న పిల్లల వైద్య నిపుణుడు ప్రస్తుతం తన వృత్తిని వదిలి ఆటో రిక్షాను నడుపుకొంటున్నాడు.

15 నెలలుగా వేతనం లేకపోవడంతో కుటుంబాన్ని పోషించేందుకు గాను ఆటో రిక్షాను నడుపుతున్నాడాయన.డాక్టర్ రవీంద్రనాథ్ బళ్లారి జిల్లాలో 24 ఏళ్లుగా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేశాడు.

ప్రస్తుతం ఆయన దేవనగెరే పట్టణంలో ఆటో డ్రైవర్  గా పనిచేస్తున్నాడు. తాను ఆటో డ్రైవర్ గా మారడానికి ఓ ఐఎఎస్ అధికారి కారణమని ఆయన ఆరోపిస్తున్నాడు.ఓ ఐఎఎస్ అధికారికి సహకరించడానికి నిరాకరించిన కారణంగానే తనకు కష్టాలు మొదలైనట్టుగా డాక్టర్ రవీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశాడు.జిల్లా పరిషత్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించిన అధికారి తనను వేధింపులకు గురిచేశాడని ఆయన గుర్తు చేసుకొన్నాడు. 

ఔట్ సోర్సింగ్ విభాగంలో హెల్త్ స్టాప్ విషయంలో టెక్నికల్ మిస్టేక్ చోటు చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తించాడు. అయితే ఈ తప్పిదం తన వల్ల కాలేదని  తాను చెప్పినా కూడ వినలేదన్నారు.ఈ కారణాన్ని చూపి 2019 జూన్ 6వ తేదీన తనను సస్పెండ్ చేశారని  చెప్పారు. దీంతో తాను కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించినట్టుగా చెప్పారు. ట్రిబ్యునల్ తనను తిరిగి నియమించాలని అదే ఏడాది అక్టోబర్ మాసంలో ఆదేశాలు ఇచ్చిందన్నారు.

ఈ ఆదేశాలకు అనుగుణంగా కలబౌర్గి జిల్లాలోని సెడం జనరల్ ఆసుపత్రిలో  అదే ఏడాది డిసెంబర్ మాసంలో సీనియర్ మెడికల్ అధికారిగా నియమించారు.గ్రామీణ ప్రాంతాల్లో తాను 17 ఏళ్ల పాటు వైద్య సేవలు అందించినట్టుగా ఆయన చెప్పారు. బళ్లారి జిల్లాలో పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ బలోపేతం చేసేందుకు ప్రయత్నించినట్టుగా వివరించారు.ఈ క్రమంలోనే తనకు అవార్డులు కూడ వచ్చాయన్నారు.

ట్రిబ్యునల్ ఇచ్చిన ఆధేశాలను ఇంతవరకు అమలు చేయలేదని డాక్టర్ రవీంద్రనాథ్ చెప్పారు. కోర్టు  ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ మరోసారి ట్రిబ్యునల్ ను కూడ ఆశ్రయించినట్టుగా ఆయన గుర్తు చేశారు.

కనీసం ఈ ఆసుపత్రి నుండి బదిలీ చేయాలని కోరినా కూడ పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాలతో దావణగెరెకు డాక్టర్ రవీంద్రనాథ్ చేరాడు. తన కుటుంబాన్ని పోషించుకొనేందుకు ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు.

ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం తనకు లైసెన్సు కోసం అదే అధికారుల వద్దకు వెళ్లాలి. తనకు అనుమతి లభించదు. ప్రైవేట్ ఆసుపత్రి ఏర్పాటుకు తన వద్ద సరైన నిధులు లేవన్నారు. మరోవైపు ఆటో రిక్షా కొనుగోలు కోసం తనకు భ్యాంకులు కూడ లోన్ కూడ ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా ఆయన చెప్పారు.

వైద్య విభాగంలో పనిచేసిన ఒకరు తనకు సహాయం చేయడంతో తాను ఆటో రిక్షా నడుపుతున్నట్టుగా ఆయన చెప్పారు.ఆటో రిక్షాపై ఐఎఎస్ వేధింపుల గురించి రాయించాడు.

click me!