స్వలింగ వివాహాల చట్టబద్ధతపై అభిప్రాయం చెప్పండి.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

By team teluguFirst Published Nov 26, 2022, 11:53 AM IST
Highlights

ప్రత్యేక వివాహాల చట్టబద్ధతపై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, అటార్నీ జనరల్ కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని పేర్కొంది. 

ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు కేంద్రానికి, అటార్నీ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. ఎల్‌జీబీటీక్యూ+ కమ్యూనిటీలలో ఏకాభిప్రాయంతో కూడిన ప్రైవేట్ లైంగిక సంబంధాన్ని నేరంగా పరిగణించకూడదని తేలిన నాలుగేళ్ల తరువాత.. ప్రత్యేక వివాహానికి గుర్తింపు ఇవ్వాలంటూ ఇద్దరు స్వలింగ సంపర్కుల అభ్యర్థనలపై కేంద్ర ప్రభుత్వంపై స్పందించాలని సుప్రీంకోర్టు కోరింది. భారతదేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకారం తెలుపుతూ.. కేంద్ర అభిప్రాయాన్ని కోరింది.

వార్నీ.. కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తైనా తీరు మారకపోవడంతో... అదేం చేసిందంటే..

హైదరాబాద్‌కు చెందిన భాగస్వాములు సుప్రియా చక్రవర్తి, అభయ్‌ డాంగ్‌లు దాఖలు చేసిన రెండు పిటిషన్‌లపై నాలుగు వారాల్లోగా స్పందించాలని కోరుతూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలోఅటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ సహాయాన్ని కూడా సుప్రీంకోర్టు అభ్యర్థిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి వివాహాలను గుర్తించకపోవడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని ధర్మాసనం తెలిపింది.

భారతావని చరిత్రలో ఎప్పటికీ మానని గాయం.. ఆ ఉగ్రదాడికి 14 ఏండ్లు..

ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్లు వాదిస్తూ.. స్వలింగ వివాహాన్ని గుర్తించకపోవడం అనేది ఎల్జీబీటీక్యూ+ జంటల గౌరవం, స్వీయ పరిపూర్ణతను దెబ్బతీసే వివక్ష చర్య అని తెలిపారు. ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ సభ్యులకు, వారి కుటుంబాలకు నిర్మాణాత్మక, వైఖరి మార్పులు చాలా అవసరమని పేర్కొన్నారు. గృహాలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలతో పాటు అన్ని రంగాలకు విస్తరించాలని అన్నారు.

ఒలింపిక్ విజేతతో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎన్కే కౌల్, ముకుల్ రోహత్గీ, మేనక గురుస్వామి, సౌరభ్ కిర్పాల్ వాదనలు వినిపిస్తూ.. నవతేజ్ సింగ్ జోహార్ కేసులో 2018 సెప్టెంబర్ 6న ఇచ్చిన తీర్పులో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన సభ్యులను భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 కింద ప్రాసిక్యూట్ చేయడం, హింసించడం కుదరదని సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. ‘‘రాజ్యాంగం ద్వారా రక్షించబడిన స్వేచ్ఛలతో పాటు, ఇతర పౌరులందరిలాగే ఎల్జీబీటీ కమ్యూనిటీ సభ్యులు కూడా పూర్తి స్థాయి రాజ్యాంగ హక్కులకు అర్హులు’’ అని జోహార్ తీర్పులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వారు తెలిపారు.

ప్రియుడు మాట్లాడడం లేదని విషం తాగుతూ సెల్ఫీ వీడియో.. చివరికి..

కాగా.. కేరళ, ఢిల్లీ హైకోర్టుల ముందు ఇదే అంశంపై తొమ్మిది పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, ఈ కేసులన్నింటినీ సుప్రీంకోర్టు ఏకరూప తీర్పు కోసం బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం కేరళ హైకోర్టుకు చెప్పిందని ఎన్కే కౌల్ కోర్టుకు చెప్పడంతో ఈ పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 

click me!