టీచర్ల నీచ కార్యం, లేడీ టీచర్ల సహకారం: ఏడాదిగా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

By telugu teamFirst Published Jul 26, 2020, 9:14 AM IST
Highlights

బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టారు. 13 ఏళ్ల విద్యార్థినిపై టీచర్లు సామూహిక అత్యాచారం చేశారు. వారికి మహిళా టీచర్లు సహకరించారు. ఈ సంఘటన రాజస్థాన్ లో జరిగింది.

జైపూరు: సద్బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు కళ్లు కామంతో మూసుకుపోయి అత్యంత నీచమైన పనికి పూనుకున్నారు. రాజస్థాన్ లో 13 విద్యార్థినిపై పాఠశాల ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘఠన అల్వార్ జిల్లాలోని నారాయణపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 

పాఠశాల మేనేజర్ తో పాటు ఉపాధ్యాయులు, ఇతరులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంోత 13 మంది సిబ్బందిపై పోక్సో, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

బాలికపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులకు సహకరించారనే ఆరోపణపై ముగ్గురు మహిళా టీచర్లపై కూడా కేసు నమోదైంది.

బాలికను వైద్యుల బృందం పరీక్షించిందని పోలీసులు అధికారులు చెప్పారు. బాలిక వాంగ్మూలం రికార్డు చేయనున్నట్లు తెలిపారు. కేసు పెట్టకూడదని మహిళా టీచర్ల బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి పెట్టినట్లు ఆరోపించారు. 

పాఠశాల డైరెక్టర్ బల్వీర్ సింగ్ తనపై పాఠశాలలోనూ ఇంటిలోనూ పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పిందని పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయులు సతీష్ శర్మ, ప్రకాశ్ సైనీ, కపిల్ సైనీ, భవాని సింగ్ షేకావత్, చిత్రమాల్ సైనీ, నీరజ్, పురన్ యాదవ్, యాద్రం, డ్రైవర్ ముకేశ్ తనపై అత్యాచారం చేసినట్లు బాధితురులు చెప్పింది. ఆ విషయం తెలిసినప్పటికీ టీచర్లు అనిత షెకావత్, జ్యోతి జంగిద్, ఖామోస్ యాదవ్ మౌనంగా ఉండిపోయారని చెప్పింది. వారిపై కూడా కేసులు నమోదయ్యాయి.

click me!