Latest Videos

"నన్ను 7-8 సార్లు కొట్టాడు.. ఆ సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నా.. కానీ,": స్వాతి మలివాల్ 

By Rajesh KarampooriFirst Published May 23, 2024, 5:29 PM IST
Highlights

Swati Maliwal: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌‌పై ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే. తాజాగా ఈ అంశంపై బాధితురాలు, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Swati Maliwal: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌‌పై ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే. ఈ వ్యవహారం దేశ రాజకీయాలను షేక్ చేస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసంలోనే తనపై దాడి జరిగినట్లు ఎంపీ ఆరోపణలు చేయడంతో అక్కడి సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అంశంపై బాధితురాలు, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ స్పందించారు. 

మే 13న తనపై జరిగిన దాడి గురించి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ANIతో మాట్లాడుతూ.. 'మే 13న ఉదయం 9 గంటల ప్రాంతంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలవడానికి వెళ్లాను. అక్కడి సిబ్బంది నన్ను డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి, అరవింద్ జీ ఇంట్లో ఉన్నారని, నన్ను కలవడానికి వస్తున్నారని చెప్పారు. ఇంతలో కేజ్రీవాల్ పీఎస్ విభవ్ కుమార్ డబ్బుతో అక్కడికి వచ్చారు. ఆ తరువాత  పిఎ బిభవ్ కుమార్ నా దగ్గర కు  వచ్చి నన్ను దుర్భాషలాడడం ప్రారంభించాడు.

’నన్ను 7-8 సార్లు  కొట్టాడు ’
 
ఈ క్రమంలోనే విభవ్ నన్ను 7-8 సార్లు  ఇష్టానుసారంగా కొట్టాడు. ఈ క్రమంలో నేను అతనిని నెట్టడానికి ప్రయత్నించాను. కానీ,  అతను నా కాలు పట్టుకుని నన్ను క్రిందికి లాగాడు. దాని కారణంగా నా తల సెంటర్ టేబుల్‌కి తగిలింది. నేను కింద పడిపోయాను. అయినా అతడు నన్ను తన్నుతునే ఉన్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో నేను బిగ్గరగా అరుస్తూ సహాయం కోసం వేడుకున్నాను. కానీ ఎవరూ కూడా నాకు సహాయం చేయలేదు. సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు.  

'నేను ఎవరికీ క్లీన్‌ చిట్‌ ఇవ్వడం లేదు'

స్వాతి మలివాల్  ఇంకా మాట్లాడుతూ.. 'ఒకరిని కొట్టే ధైర్యం విభవ్‌కు లేదు.  దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడుతాయి. నేను ఢిల్లీ పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నాను. నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వడం లేదు. నాపై దాడి జరుగుతున్నప్పుడు అరవింద్ జీ ఇంట్లో ఉన్నాడు. నన్ను చాలా దారుణంగా కొట్టారు. నేను అరుస్తూ అరుస్తున్నా ఎవరూ రాలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

స్వాతి మలివాల్  ఇంకా మాట్లాడుతూ.. 'నాకు ఏమి జరుగుతుందో, నా కెరీర్‌కు ఏమి జరుగుతుందో, ఇంతమంది నన్ను ఏమి చేస్తారో నేను ఆలోచించలేదు. నేను ఆడవాళ్ళందరికీ చెప్పాను. మీరు ఎప్పుడూ నిజం పక్షాన నిలబడాలి, మీరు నిజమైన ఫిర్యాదు చేయాలి, మీకు ఏదైనా తప్పు జరిగితే మీరు పోరాడాలి. కాబట్టి నేను ఈ రోజు నేను పోరాడుతున్నాను’అని అన్నారు. 

విచారణ న్యాయబద్దంగా జరగాలి- కేజ్రీవాల్ 

స్వాతి మలివాల్ దాడి ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి నిన్న(బుధవారం)స్పందించారు. వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'కేసులో న్యాయమైన విచారణ జరిగి న్యాయం గెలువాలని ఆశిస్తున్నాను' అని అన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు నేడు (గురువారం) కేజ్రీవాల్ తల్లిదండ్రులను విచారిస్తున్నారు. , అయితే చివరి క్షణంలో ప్రశ్నించే ప్రణాళిక రద్దు చేయబడింది.
 

click me!