Latest Videos

Lok Sabha Elections 2024: ప్రతిపక్ష కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి: ప్రధాని మోడీ

By Rajesh KarampooriFirst Published May 22, 2024, 8:51 PM IST
Highlights

Lok Sabha Elections 2024: స్వాతంత్య్రానంతరం తొలిసారిగా భారత ప్రజలు కాంగ్రెస్ మోడల్‌కు, బీజేపీ మోడల్‌కు మధ్య తేడాను స్పష్టంగా చూశారని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని ద్వారకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, ప్రతిపక్ష కూటమిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
 

Lok Sabha Elections 2024: స్వాతంత్య్రానంతరం తొలిసారిగా భారత ప్రజలు కాంగ్రెస్ మోడల్‌కు, బీజేపీ మోడల్‌కు మధ్య తేడాను స్పష్టంగా చూశారని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, ఇండీ కూటమికి ముందస్తుగా ఆలోచించే సమయం గానీ, సామర్థ్యం గానీ లేవని అన్నారు. ఆ కూటమిలోని వ్యక్తులు 60 ఏళ్లుగా భారతదేశ సామర్థ్యానికి నిర్వీర్యం చేశారనీ, వారు నేరపూరిత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

140 కోట్లు ఉన్న ఈ దేశంలో భారతదేశానికి కావలసిన శక్తి సామర్థ్యాలను బీజేపీ ప్రభుత్వం మాత్రమే మెరుగుదిద్దగలదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ద్వారకలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఢిల్లీ మూడ్ ఎలా ఉందో దేశం చూస్తోందని అన్నారు. ఇప్పటి వరకు 400కు పైగా స్థానాల్లో ఓటింగ్ జరగ్గా, ఐదు దశల్లో ఓటింగ్ జరిగిన తీరు చూస్తే దేశంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతోందని స్పష్టమవుతోందని అన్నారు.  

బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పు చెరగారు. 'కాంగ్రెస్ ప్రతిరోజూ కేవలం 12 కిలోమీటర్ల హైవేలను మాత్రమే నిర్మించగలిగింది. కానీ, మోడీ ప్రభుత్వం ప్రతిరోజూ దాదాపు 30 కిలోమీటర్ల హైవేలను నిర్మిస్తోంది.
 

కాంగ్రెస్ 60 ఏళ్లలో గరిష్టంగా 70 విమానాశ్రయాలను నిర్మించగలిగిందనీ, మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో 70 కొత్త విమానాశ్రయాలను నిర్మించిందనీ, కాంగ్రెస్ తన 60 ఏళ్ల పాలనలో 380 మెడికల్ కాలేజీలను నిర్మించగలిగితే.. తమ 10 ఏళ్ల పాలనలో 325 కంటే ఎక్కువ కొత్త మెడికల్ కాలేజీలను నిర్మించామని తెలిపారు. అలాగే.. కాంగ్రెస్ హయాంలో కేవలం 7 ఎయిమ్స్‌లను నిర్మిస్తే.. తాము 22 కంటే ఎక్కువ ఎయిమ్స్ స్థాపించామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 75 శాతం మందికి కుళాయి కనెక్షన్లు లేవని, నేడు 75 శాతం మందికి ఇళ్లలో కుళాయి నీరు అందుతుందని అన్నారు. కాంగ్రెస్ తన 60 ఏళ్ల పాలనలో 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని, కానీ తమ పదేళ్లలో 18 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. 

రక్షణ రంగంలో కీలక సంస్కరణలు  

భారత రక్షణ రంగాన్ని కాంగ్రెస్‌ నాశనం చేసిందని ప్రధాని మోదీ అన్నారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నేడు మన దేశం లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన రక్షణ ఉత్పత్తిని చేస్తుందని అన్నారు.  అలాగే.. దేశంలోని బ్యాంకులను నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేననీ, కానీ నేడు దేశంలోని బ్యాంకులు రూ.3 లక్షల కోట్ల లాభాలు గడిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి 100 పైసలు పంపితే లబ్ధిదారుల ఖాతాలో  15 పైసలు మాత్రమే చేరేవనీ, 85 పైసలు నాయకుల జేబుల్లోకి వెళ్లేవని విరుచుకపడ్డారు. 

అలాగే ప్రతిపక్ష కూటమి గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండియా కూటమిలోని ప్రజలు చాలా మతతత్వం, కులతత్వం, కుటుంబ ఆధారిత రాజకీయాలు చేసేవారని మండిపడ్డారు. కానీ నేడు వారు తమ పాపాలను దేశ ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగానికి ద్రోహం చేసిన వారిని, ఇప్పుడు దేశం అటువంటి తీవ్ర మతతత్వ వ్యక్తులను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.

సిక్కు అల్లర్లకు కారణం కాంగ్రెస్సే.. 

1984 నాటి సిక్కు అల్లర్లను ప్రధాని మోదీ గుర్తు చేసుకుంటూ.. 'ఇండియా కూటమి నాయకులారా .. సమాధానం చెప్పండి. ఢిల్లీలోనే మన సిక్కు సోదరులు, సోదరీమణులను మెడలకు టైర్లు కట్టి సజీవ దహనం చేశారు. ఇది ఎవరి నేరం? ఈ దారుణానికి పాల్పడిందేవరు? ప్రశ్నించారు. సిక్కు అల్లర్ల బాధితులకు న్యాయం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.

ఉన్నత విద్యలో ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ, దళిత, గిరిజన సోదర సోదరీమణుల హక్కులను కాలరాయడానికి కాంగ్రెస్‌ కృషి చేసింది. మన ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ, దళిత, గిరిజన సోదర సోదరీమణులకు కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో దేశం మొత్తానికి తెలుసు అన్నారు. ఆ దారుణాన్ని యువరాజు కూడా అంగీకరించారనీ, తన నాన్నమ్మ, తన తండ్రి, తన తల్లి పాలనలో దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులపై విద్వేష పూరితంగా వ్యవహరించారని ఆయన అంగీకరించారనీ,  కాంగ్రెస్ SC-ST-OBCలను నాశనం చేసిందని ప్రధాని మండి పడ్డారు. 

అంతకు ముందు ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ లోని శ్రావస్తి జరిగిన ప్రచారంలో మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో మూడు తీవ్రమైన వ్యాధులు ఉన్నాయని, వాటి కారణంగా దేశం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. INDI కూటమి లోని నాయకుల్లో తీవ్ర మతవాదులు, తీవ్ర కులవాదులు,  కుటుంబ పాలన చేసేవారు ఉన్నారనీ, ఈ మూడు వ్యాధులు క్యాన్సర్ కంటే దేశానికి మరింత వినాశకరమైనవిగా మారతాయని విమర్శించారు. 

click me!