Latest Videos

బెంగళూరు రేవ్ పార్టీపై కొత్త అనుమానాలు... ఆ అమ్మాయిలు అందుకోసమేనా..?

By Arun Kumar PFirst Published May 23, 2024, 2:06 PM IST
Highlights

బెంగళూరు రేవ్ పార్టీపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఈ పార్టీలో భారీగా అమ్మాయిలు పట్టుబడటంతో వారి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ప్రచారం ఊపందుకుంది. 

Bangalore Rave Party : ఎక్కడో కర్ణాటక రాజధాని బెంగళూరులో రేవ్ పార్టీ జరిగితే తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. ఎందుకంటే ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో తెలుగువాళ్లే ఎక్కువ వున్నారు కాబట్టి. అంతేకాదు కొందరు సినీతారలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ రేవ్ పార్టీకి హాజరై పోలీసులకు పట్టుబడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బెంగళూరు రేవ్ పార్టీపై తెలుగు ప్రజల్లో తెగ చర్చ సాగుతోంది. 

అయితే ఈ రేవ్ పార్టీపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయడంతో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో కేవలం మద్యం, డ్రగ్స్ మాత్రమే కాదు సెక్స్ రాకెట్ పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పార్టీ నిర్వహకులే కొందరు అమ్మాయిలను ఈ  పార్టీకి రప్పించడమే ఈ అనుమానాలకు తావిస్తోంది.  

కేవలం మద్యం తాగడానికో, మ్యూజిక్ ను ఎంజాయ్ చేయడానికో లక్షలకు లక్షలు పోసి ఈ రేవ్ పార్టీకి వచ్చివుండరనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి ఎందుకు సినిమావాళ్ళు, రాజకీయ ప్రముఖులు, బడాబాబుల పిల్లలు ఈ పార్టీకి హాజరయ్యారు..?  అంత డబ్బు చెల్లించి ఈ పార్టీకి వచ్చింది డ్రగ్స్ తో పాటు అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికేనా? అంటే అవునేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  

బెంగళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీకోసం నిర్వహకులే కొందరు అమ్మాయిలను తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసుల దాడి చేసిన సమయంలో 30 మంది అమ్మాయిలు కూడా పట్టుబడ్డారు... అయితే వీరు ఎంట్రీ టికెట్ తీసుకుని పార్టీకి వచ్చినవారు కాదట... నిర్వహకులే వీరిని పార్టీకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. విమానాల్లో వీరిని బెంగళూరుకు తీసుకువచ్చిన రేవ్ పార్టీ నిర్వహకులు పార్టీలో పాల్గొన్నవారిని ఆకర్షించేందుకు ఉపయోగించివుంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ఈ రేవ్ పార్టీలో సెక్స్ రాకెట్ ఏమైనా జరిగిందా..? పార్టీలో అమ్మాయిల పాత్ర ఏమిటి? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. 


 

click me!