Covid-19: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ పంజాతో పలు దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ అధికమవుతున్నాయి. ఒకే రోజుకు 10కి పైగా ఒమిక్రాన్ కేసులు నమోదుకావడంతో భారత్ కొత్త వేరియంట్ కేసులు సెంచరీకి చేరువయ్యాయి.
omicron : దక్షిణాఫ్రికాలో గత నెలలో వెగులుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. పలు దేశాల్లో ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. భారత్ లోనూ ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య సెంచరీకి చేరువైంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. కొత్తగా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 87కు చేరాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా మహారాష్ట్రలో 32 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కర్నాటకలో 8, తెలంగాణలో 7, ఢిల్లీలో 10, మహారాష్ట్రలో 32, రాజస్తాన్ లో 17, కేరళలో 5, గుజరాత్ లో 5, ఏపీ, తమిళనాడు, బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒమిక్రాన్ కేసు నమోదైంది.
Also Read: coronavirus updates: కరోనాకు డెన్మార్క్ సైంటిస్టుల కొత్త మందు!
undefined
కర్నాటకలో కొత్తగా నమోదైన ఒమిక్రాన్ కేసులను ఆ రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్యా మంత్రి డాక్టర్ కె సుధాకర్ ధృవీకరించారు. దీంతో మొత్తం వేరియంట్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఐదుగురు వ్యక్తులలో, నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వారిలో 19-70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో UK నుండి తిరిగి వస్తున్న 19 సంవత్సరాల ఓ వ్యక్తి ఉన్నాడు. ఢిల్లీ నుంచి తిరిగివస్తున్న ఒక మహిళా, పురుషుడు, నైజీరియా నుండి వస్తున్న మరో ఇద్దరు ఉన్నారని మంత్రి వెల్లడించారు. కాగా, దేశంలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు డిసెంబర్ 2న కర్నాటకలోనే నమోదుకావడం గమనార్హం. మరోవైపు, తెలంగాణ లోనూ ఒకే నాటులు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు రోగులు కెన్యా నుండి తిరిగి వచ్చారు. వారు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. నాల్గో వ్యక్తి భారతీయ సంతతికి చెందినవాడు. తాజాగా కేసులతో కలుపుకుని తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆరుకు పైగా పేరిగాయి.
దేశరాజధాని ఢిల్లీలోనూ మరో 4 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కొత్త కేసులు సంఖ్య మొత్తం 10కి పెరిగింది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ, "ప్రస్తుతం, తొమ్మిది మంది ఒమిక్రాన్ రోగులు ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేరారు. ఒక పేషెంట్ ఇంతకు ముందు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుత పేషెంట్లలో ఎవరూ సీరియస్‌గా లేరు" అని వెల్లడించారు. ప్రస్తుతం, 40 మంది కోవిడ్ రోగులు ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం విమానాశ్రయం నుండి ఎనిమిది మంది అనుమానితులు వచ్చారు. విమానాశ్రయం నుండి వస్తున్న చాలా మందికి కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించబడింది. ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో ప్రత్యేక ఓమిక్రాన్ వార్డు ఉంది. పడకల సంఖ్య 40 నుంచి 100కి పెంచారు. భారతదేశంలోని ల్యాబ్‌లలో వందలకొద్దీ కోవిడ్-19 పాజిటివ్ శాంపిల్స్ జన్యుపరీక్షలు కూడా జరుగుతున్నాయి.
Also Read: Gwalior | ఉద్యోగులను ఉరి తీస్తానంటూ కలెక్టర్ వార్నింగ్.. వైరలవుతున్న వీడియో
ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పలు దేశాల్లో ప్రమాదకర స్థాయిలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా , బ్రిటన్‌లో ఒమిక్రాన్ విలయతాండవం చేస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయి. లండన్, మాంచెస్టర్ లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఇప్పటివరకు 22వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు సమాచారం. దాదాపు 80కి పైగా దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైరస్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని సూచిస్తోంది.
Also Read: Punjab polls | కేజ్రీవాల్ తిరంగా యాత్ర.. పంజాబ్‌లో కాకరేపుతున్న రాజకీయం !