‘‘రేప్ తప్పనిసరైతే.. పడుకుని ఆనందించండి’’... అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 16, 2021, 11:05 PM IST
Highlights

కర్ణాటక అసెంబ్లీ (karnataka) మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ (kr Ramesh kumar) (అత్యాచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేప్ అనివార్యమైనప్పుడు, పడుకుని ఆనందించండి” అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు సభలో పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే రమేశ్ కుమార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు

కర్ణాటక అసెంబ్లీ (karnataka) మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ (kr Ramesh kumar) (అత్యాచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేప్ అనివార్యమైనప్పుడు, పడుకుని ఆనందించండి” అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు సభలో పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే రమేశ్ కుమార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ జోక్స్ వేసి ఎన్నోసార్లు పరువు పొగొట్టుకున్నారాయన. 

2019లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా వున్న రమేశ్ కుమార్ తనను తాను అత్యాచార బాధితుడితో  పోల్చుకున్నారు. పార్టీ నుంచి రూ.50 కోట్ల లంచం తీసుకున్నారంటూ యడియూరప్ప, ఇతర సీనియర్ నేతలు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తూ ఆడియో టేప్ వైరల్ అయ్యింది. ఈ ఆడియో క్లిప్‌లో తన పేరు వినిపించిన సమయంలో రమేశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేపుల్లో తనపై ఆరోపణలు చేయడంతో రమేశ్ కుమార్ చర్చకు కేంద్ర బిందువుగా మారారు. ఆ సమయంలోనే తన పరిస్ధితి అత్యాచార బాధితురాలిగా వుందని రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. 

అయితే ఈ వ్యాఖ్యలపై మహిళా శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రమేశ్ కుమార్ సభకు క్షమాపణలు చెప్పారు. అత్యాచార బాధితురాలిని న్యాయస్థానంలో రేప్ బాధితురాలిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు పదే పదే గుచ్చిగుచ్చి అడగటాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశానని రమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు. 2020 సెప్టెంబర్‌లోనూ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరీని వెంటనే అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని చెబుతూ కూడా రమేశ్ కుమార్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

కోవిడ్ 19 చర్చ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్ సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. పీపీఈ కిట్‌లు కొనుగోలు చేసిన ధరల్లోని వ్యత్యాసాన్ని పునరుద్ఘాటించారు. అంతేకాదు పీపీఈ కిట్‌లకు సంబంధించి పలు కమిటీలు పనిచేశాయి. అయితే ఆ కమిటీల్లో గొప్ప వ్యక్తులు **** అలాంటి పనులు చేస్తూ వుంటారంటూ రమేశ్ కుమార్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి ఈశ్వరప్ప.. రమేశ్ కుమార్‌ని **** మేం ఆ మాట అంటే ఎలా వుంటుందో చెప్పాలన్నారు. తమ ఇంట్లో ఆ పదం పిల్లలు ఉపయోగిస్తే ఖచ్చితంగా దండిస్తామన్నారు. ఎట్టకేలకు స్పీకర్ జోక్యం చేసుకోవడంతో ఆ పదం ‘‘అన్‌పార్లమెంటరీ’’ అని తేల్చిచెప్పారు. 

click me!