
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. స్నాచర్స్ బరి తెగించారు. ఫోన్ కోసం ఓ అమ్మాయి ప్రాణాలతో ఆడుకున్నారు. టూ వీలర్ మీద ఆమెను లాగుతూ 150 మీటర్లు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయడింది. ఓ చోట రోడ్డుమీద పడిపోయిన ఆమెను స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెడితే..
ఢిల్లీలో motorbike-borne criminals నడుచుకుంటూ వెడుతున్న మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించి.. ఆ మహిళను dragging చేస్తూ తీసుకెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. బైక్ మీద పిలియన్ సీట్‌లో కూర్చున్న వ్యక్తి రోడ్డు మధ్యలో వెడుతున్న అమ్మాయిని mobile phone లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె ఫోన్ గట్టిగా పట్టుకోవడంతో అలాగే ఈడ్చుకుంటూ వచ్చారు. అలా 150 మీటర్లు వచ్చాక పట్టుతప్పి ఆమె కిందపడిపోయింది. వెంటనే టూ వీలర్ మీది వ్యక్తులు పరారయ్యారు.
ఆ సమయంలో traffic ఎక్కువగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు మధ్యలో పడిపోయిన ఆ అమ్మాయిని అక్కడున్నవారు వెంటనే కాపాడారు. దేశ రాజధానిలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆమెను బాధితుడిని 150 మీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. ఆమె షాలిమార్ బాగ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆమెను అక్కడికే తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
‘‘రేప్ తప్పనిసరైతే.. పడుకుని ఆనందించండి’’... అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే డిసెంబర్ ఫస్ట్ న హైదరాబాద్ లో జరిగింది. నటి షాలు చౌరాసియాపై ఓ దుండగుడు దాడి చేసి ఆమె ఆపిల్ మొబైల్ తీసుకొని పారిపోయాడు. ఈ దాడిలో చౌరాసియా గాయాలపాలు కావడంతో పాటు షాక్ కి గురయ్యారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడ్ని కనిపెట్టి అరెస్ట్ చేశారు. కాగా ముంబైలో నటి నిఖిత దత్తకు ఇదే తరహా సంఘటన ఎదురైంది. ఆదివారం ఆమె ముంబై బాంద్రా సమీపంలో రోడ్డుపై నడిచివెళుతుండగా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.
నిఖిత దత్త(Nikita dutta) తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ విధంగా సంఘటన గురించి వివరించారు. బాంద్రా రోడ్ నంబర్ 14లో రాత్రి 7:45 గంటల సమయంలో ఒంటరిగా రోడ్డుపై నడిచివెళుతున్నాను. ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి నా తల వెనుకభాగంలో చిన్నగా కొట్టారు. దానితో నేను సడన్ షాక్ కి గురయ్యారు. వెంటనే బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తి నా మొబైల్ చేతిలో నుండి లాక్కున్నాడు. అప్పుడు బైక్ కదలికలోనే ఉంది.
రెండు మూడు సెకండ్స్ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. వెంటనే కోలుకొని బైక్ ని వెంబడించాను. నా అరుపులకు అక్కడ ఉన్నవారు స్పందించారు. ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్లిద్దరూ వేగంగా బైక్ నడుపుకుంటూ దొరక్కుండా పారిపోయారు. స్థానికులు నాకు మద్దతుగా నిలిచారు. వాటర్ ఇచ్చి, నాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇచ్చాను... అని ఆమె వివరించారు.