బీజేపీలో చేరిన జేడీయూ మాజీ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్..

Published : May 11, 2023, 02:43 PM IST
బీజేపీలో చేరిన జేడీయూ మాజీ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్..

సారాంశం

కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ చీఫ్ ఆర్సీపీ సింగ్ బీజేపీలో చేరారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ తో విబేధాల కారణంగా ఆయన జేడీయూకు గతేడాది రాజీనామా చేశారు. 

కేంద్ర మాజీ మంత్రి, జనతాదళ్ (యునైటెడ్) మాజీ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ బీజేపీలో చేరారు. అవినీతి ఆరోపణలపై ఆయన పార్టీ సమాధానం కోరడంతో గత ఏడాది ఆగస్టులో జేడీయూ నుంచి వైదొలుగుతున్నట్లు సింగ్ ప్రకటించారు. పార్టీ పంపిన షోకాజ్ నోటీసుల్లో స్థిరాస్తుల్లో వ్యత్యాసాలపై ఆర్సీపీ సింగ్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. వీలైనంత తొందరగా వాటికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆయన పార్టీని వీడారు.

కేదార్ నాథ్ యాత్రలో తప్పిపోయిన ఏపీకి చెందిన వృద్ధురాలు.. గూగుల్ ట్రాన్స్ లేట్ సాయంతో కుటుంబ సభ్యుల వద్దకు..

నలంద జిల్లాలోని జనతాదళ్ (యు)కు చెందిన ఇద్దరు సహచరుల నుంచి ఆధారాలతో ఫిర్యాదు అందిందని పార్టీ తన షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. 2013-2022 మధ్య (ఆర్సీపీ సింగ్) పేరు మీద నమోదైన స్థిరాస్తులు, అతడి కుటుంబ సభ్యుల పేరిట నమోదైన స్థిరాస్తుల్లో వ్యత్యాసాలు కనిపించాయని వారు పేర్కొన్నట్టు తెలిపింది. 

తానా సాయంతో హైదరాబాద్ కు చేరుకున్న తాటికొండ ఐశ్వర్య మృతదేహం..

కాగా.. గత ఏడాది సెప్టెంబర్ లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్సీపీ సింగ్ పై ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ఏక్ నాథ్ షిండేను ఉపయోగించి శివసేనను విడగొట్టినట్టు, ఆర్సీపీ సింగ్ ను కూడా తమ పార్టీని ఏకాకిని చేయాలని బీజేపీ వాడుకోవాలని చూసిందని ఆరోపించారు. 

‘‘ఆయనకు (ఆర్ సీపీ సింగ్) తమ పార్టీ బాధ్యతాయుతమైన పదవులు ఇచ్చింది. అయినా ఆయన మా పార్టీని విడిచిపెట్టాడు. ఆయన చాలా గందరగోళానికి గురయ్యాడు. ఆర్పీసీ సింగ్ కు ఇంతకు ముందు ఎవరు తెలుసు? నేను ఆయనను కొత్త ఎత్తులకు చేర్చాను. 2020లో ఆయనకు పార్టీ చీఫ్‌గా స్థానం కల్పించి.. ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాం. ఆయనకు మేం చాలా గౌరవం ఇచ్చాం. కేంద్రంలో మంత్రి అయ్యాక పార్టీ చీఫ్ పదవిని వదులుకోమని చెప్పాం. దానిని లాలన్ జీకి ఇచ్చాం. ఆయన తన ప్రకటనల ద్వారా పార్టీలోని వ్యక్తుల మనోభావాలను దెబ్బతీశారు’’ అని నితీశ్‌ కుమార్‌ అన్నారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది.

మూడేళ్ల కూతురిని కాపాడేందుకు చిరుతపులితోనే పోరాడిన దంపతులు.. ఎక్కడంటే ?

కాగా.. ఈ ఆరోపణలను సింగ్ తోసిపుచ్చారు. ప్రధాని అభ్యర్థి కావడానికి ప్రతిపక్షాల మద్దతు కూడగట్టడమే నితీశ్ కుమార్ లక్ష్యమని ఆర్సీపీ సింగ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా 2022లో నితీష్ కుమార్ బీజేపీని విడిచిపెట్టారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, ఇతర పార్టీలతో చేతులు కలిపారు. మహాకూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా మళ్లీ నితీష్ కుమార్ యాదవ్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ
Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu