యువతిపై రేప్ ఆరోపణలు: సీనియర్ ఐఎఎస్ జితేంద్ర సస్పెన్షన్ వేటు

By narsimha lodeFirst Published Oct 17, 2022, 8:42 PM IST
Highlights

యువతిపై అత్యాచారం చేశారనే ఆరోపణలపై సీనియర్ ఐఎఎస్ అధికారి   జితేంద్ర నరేన్ నుకేంద్రం  ఇవాళ  సస్పెండ్  చేసింది.ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామని  నమ్మించి  యువతిపై  అత్యాచారం   చేశారని   కేసులో  జితేంద్రపై  సస్పెన్షన్ వేటు పడింది.

న్యూఢిల్లీ:అండమాన్ నికోబార్ దీవుల్లో యువతిపై అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్  ఐఎఎస్  అధికారి జితేంద్ర  నరైన్  ను కేంద్రం  సోమవారం  నాడు  సస్పెండ్  చేసింది.  సీనియర్  ఐఎఎస్ అధికారి జితేంద్ర మహిళపై అత్యాచారం చేసినట్టుగా అండమాన్  నికోబార్ పోలీసుల నుండి  కేంద్ర హోంమంత్రిత్వశాఖకు నివేదిక అందింది.ఈ  మేరకు సీనియర్  ఐఎఎస్ అధికారిపై  చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశించినట్టుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.

మహిళల గౌరవానికి భంగం కల్గించే సంఘటనలను ప్రభుత్వం  సహించదని హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. పోర్ట్ బ్లెయిర్ లో మహిళపై  అత్యాచారానికి  పాల్పడినట్టుగా  కేసు నమోదైంది. ఈ కేసు  నమోదు కావడంతో సీనియర్ ఐఎఎస్ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హోంమంత్రిత్వశాఖ ఆదేశించింది.

ఈ కేసులో  అండమాన్ నికోబార్  పోలీసులు ,సిట్   ప్రత్యేక బృందం   చర్యలు తీసుకొంటుందని ప్రభుత్వం తెలిపింది.  అండమాన్  నికోబార్ దీవుల్లోని 21  ఏళ్ల యువతికి ప్రభుత్వఉద్యోగం  ఇప్పిస్తామని  సీఎస్ ఇంటికి రప్పించి  అత్యాచారం  చేశారనే ఆరోపణలపై  సిట్  ఏర్పాటైంది. ఈ  కేసును  సిట్  విచారణ చేస్తుంది. 

జితేంద్ర నరేన్   మరోఅధికారి  తనపై అత్యాచారానికి పాల్పడ్డారని యువతి కోర్టులో  పిటిషన్  దాఖలు   చేసింది. ఈ పిటిషన్  ఆధారంగా విచారణ చేసిన కోర్టు కేసు  నమోదు చేయాలని  ఆదేశించింది. తనపై ఇద్దరు  అధికారులు సామూహిక  అత్యాచారం చేశారని  బాధితురాలు  ఆరోపించింది.తన  ఆర్ధిక  అవసరాలను తండ్రి,సవతి తల్లి పట్టించకోని  కారణంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం  ఆమె  ప్రయత్నాలు  ప్రారంభించింది.ఈ క్రమంలోనే తనకు పరిచయం  ఉన్నవారి సహయంతో     ప్రభుత్వ అధికారులను ఆమె కలిసింది.

 

click me!