భర్తకు భార్య సెక్స్ వీడియోలు పంపిన మాజీ ప్రియుడు

By ramya neerukondaFirst Published Sep 17, 2018, 11:48 AM IST
Highlights

ఆగ్రహం చెందిన ప్రియుడు విజయ్ పవార్ తనతో వివాహిత గడిపిన వీడియోలను ఆమె భర్త, కంపెనీ బాస్ కు పంపించాడు. విజయ్ పవార్ తో గడిపినపుడు వీడియోలు తీసిన విషయం వివాహితకు తెలియదు. 

తనతో వివాహేతర సంబంధాన్ని మధ్యలో ఆపేసిందనే అక్కసుతో.. ఆమె కాపురంలో నిప్పులు పోసాడు ఓ వ్యక్తి. తనతో ఆమె గడిపిన వీడియోలను ఆమె భర్తకు పంపించాడు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయి నగరంలోని ఎల్టీ మార్గ్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఓ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది. ఈమె భర్తకు పక్షవాతం రావడంతో మంచాన పడ్డాడు. దీంతో సోషల్ మీడియా ద్వార 2016లో వివాహితకు దక్షిణ ముంబైకు చెందిన విజయ్ పవార్ పరిచయమయ్యాడు. కొన్నాళ్లు వీరి మధ్య సాగిన ప్రేమాయణాన్ని వివాహిత తెంచుకుంది.

 దీంతో ఆగ్రహం చెందిన ప్రియుడు విజయ్ పవార్ తనతో వివాహిత గడిపిన వీడియోలను ఆమె భర్త, కంపెనీ బాస్ కు పంపించాడు. విజయ్ పవార్ తో గడిపినపుడు వీడియోలు తీసిన విషయం వివాహితకు తెలియదు. మాజీప్రియుడు విజయ్ పవార్ తనకు తరచూ ఫోన్ చేసి సంబంధం కొనసాగించమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని వీడియోలు తన భర్తకు పంపించాడని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడైన విజయ్ పవార్ ను అరెస్టు చేశారు.

click me!