బలవంతంగా సెక్స్ చేసినా రేప్ కాదు.. : భార్య ఆరోపణల నుంచి భర్తకు విముక్తినిచ్చిన హైకోర్టు

By telugu teamFirst Published Aug 26, 2021, 1:43 PM IST
Highlights

చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్య, భర్తల మధ్య బలవంతపు సెక్స్‌ను రేప్‌గా పరిగణించలేమని ఛత్తీస్‌గడ్ హైకోర్టు తీర్పునిచ్చింది. భార్య చేసిన ఆరోపణల నుంచి భర్తకు విముక్తి ప్రసాదించింది. భార్య 18 ఏళ్లు నిండి ఉండాలని పేర్కొంది.

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్ హైకోర్టు దంపతుల కేసుపై ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్య భర్తల మధ్య బలవంతపు సెక్స్‌ను రేప్‌గా పరిగణించవద్దని పేర్కొంది. భార్య చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తూ భర్తకు విముక్తి ప్రసాదించింది.

మ్యారిటల్ రేప్(దాంపత్య జీవితంలో బలవంతంగా శారీరకంగా కలవడం)కు సంబంధించిన ఓ కేసును ఛత్తీస్‌గడ్ హైకోర్టు విచారిస్తున్నది. ‘భార్య 18ఏళ్లు నిండి ఉంటే, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగానైనా, లేదా బలవంతంగానైనా భర్త ఆమెతో శారీరకంగా కలిస్తే దాన్ని  లైంగికదాడిగా పరిగణించం’ అని స్పష్టం చేసింది. ‘ఈ కేసులో ఆరోపణలు చేసినావిడ నిందితుడితో జీవితాన్ని పంచుకునే భార్య. వారి మధ్య సెక్స్‌ను బలవంతంగా జరిగినదైనా లైంగికదాడి నేరంగా పరిగణించలేం’ అని ఆర్డర్ వెలువరించింది.

ఈ ఆరోపణల నుంచి నిందితుడికి విముక్తి ప్రసాదించిన హైకోర్టు మరో నేరారోపణలో దోషిగా తేల్చింది. భర్త తనతో అసహజ రీతిలో సెక్స్ చేశారన్న ఆరోపణల్లో దోషిగా నిలబెట్టింది. సెక్షన్ 377(అన్‌నేచురల్ సెక్స్) కింద చేసిన అభియోగాలను కోర్టు తప్పుపట్టలేదు.

click me!