సినీ తారలు సంజన, రాగిణి ద్వివేది జైల్లో ఏం చేస్తున్నారంటే....

By telugu teamFirst Published Sep 18, 2020, 9:03 AM IST
Highlights

కర్ణాటక డ్రగ్ కేసులో అరెస్టయిన సినీ తారలు సంజన, రాగిణి ద్వివేదిలు జైలులో సెటిల్ అయినట్లే కనిపిస్తున్నారు. జైలు అధికారులు ఇచ్చే భోజనాలను, టిఫిన్లను వారు ఆరగిస్తున్నారు.

బెంగళూరు: డ్రగ్ కేసులో అరెస్టయిన సినీ తరాలు సంజన గల్రానీ, రాగిణి ద్వివేది జైలు జీవితం ఆసక్తికరంగా సాగుతోంది. రపప్న అగ్రహార జైలులో వారు క్వారంటైన్ లో ఉన్నారు. జైలులో పెట్టిన టిఫిన్ ను, భోజనాలను వారు స్వీకరిస్తున్నారు కొంత సేపు నిద్రపోతూ, మరికొంత సేపు పుస్తకాలు చదువుతూ సమయం గడుపుతున్నారు. 

రాగిణికి వెన్ను నొప్పి సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జైలు వైద్యులు ఆమెకు మందులు అందిచారు. తల్లితో గానీ న్యాయవాదులతో గానీ కలవడానికి రాగిణికి అవకాశం ఇవ్వడం లేదు. ఫోన్లో మాట్లాడడానికి మాత్రం అవకాశం కల్పిస్తున్నారు. 

Also Read: జైలు కెళ్ళినా తలదించనని మొండికేసిన సంజన

శాండల్ వుడ్ మాదకద్రవ్యాల కేసులో దక్షిణాఫ్రికా పౌరులు ప్రధాన సూత్రధారులని సీసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడు లూమ్ పెప్పర్ సాంబాను సీసీబీ పోలీసులు 15 రోజుల క్రితం అరెస్టు చేశారు. పెప్పర్ వెల్లడించిన సమాచారం మేరకు బెనాల్డ్ ఉడెన్నా అనే ఆఫ్రికా పౌరుడిని అరెస్టు చేశారు. అతను మరిన్ని వివరాలను అందించినట్లు తెలుస్తోంది. 

కన్నడ సినిమా రంగానికి చెందినవారికి తానే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అతను అంగీకరించినట్లు చెబుతున్నారు. ఉడెన్ా ఆదిత్య ఆల్వాలకు చాలా సన్నిహితుడని, డ్రగ్స్ నిందితులు రవిశంకర్ వీరేన్ ఖన్నాలు ఉడెన్నాను తరుచుగా సంప్రదిస్తూ ఉండేవారని తెలుస్తోంది. అర్థరాత్రుళ్లు జరిగే పార్టీలకు మాదకద్రవ్యాలు సరఫరా అవుతూ ఉండేవని తెలుస్తోంది.

దాని ఆధారంగానే ఆదిత్య ఆళ్వాకు చెందిన రిసార్టుపై సీసీబీ అధికారులు దాడి చేశారు. లూమా, ఉడెన్నాలు బెంగళూరులో మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారని, వారి వెనక పెద్దలు పలువురు ఉన్నారని తెలుస్తోంది. వారు సంజన, రాగిణిలతో కలిసి పార్టీల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆదిత్య ఆళ్వా విదేశాలకు పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Also Read: కన్నడ డ్రగ్స్ కేసు... మరో ఇద్దరు నటులకు సమన్లు 

కేసులో 14వ నిందితురాలైన సంజన హైఫై పార్టీల్లో పాల్గొనడంతో పాటు ప్రకాశ్ రాంకా, రాహుల్ లతో కలిసి బెంగుళూరు, గోవా, కేరళ, శ్రీలంకల్లో పబ్, బారు అపార్టుమెంట్ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసేదని చెబుతున్నారు. సెలిబ్రిటీలకు కూడా మత్తు పదార్థాలు పంపించినట్లు రాంకా అంగీకరించాడు. 

సంజన ఇంటిలో సీసీబీ అధికారులు 9 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు .సీమ్ కార్డు, ఐఫోన్, ప్రోమాక్స్ కంప్యూటర్, సీసీ కెమెరాల డీవీఆర్ లను స్వాధీనం చేసుకుని సమాచారం సేకరిం్చారు. అందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడినట్లు తెలుస్తోంది.

click me!