Asianet News TeluguAsianet News Telugu

కన్నడ డ్రగ్స్ కేసు... మరో ఇద్దరు నటులకు సమన్లు

మాదకద్రవ్యాల కేసులో శాండిల్ వుడ్ హీరోయిన్లు  రాగిణి, సంజనలను ఇప్పటికే అరెస్టు చేశారు. రాగిణికి 14 రోజుల జైలు శిక్ష విధించబడింది. సంజన గల్రానీని సిసిబి పోలీసులు మూడు రోజుల పాటు అదుపులోకి తీసుకున్నారు.
 
2 Kannada Actors Summoned, Ex-Minister's Son Raided In Drugs Case
Author
Hyderabad, First Published Sep 16, 2020, 10:03 AM IST

డ్రగ్స్ కేసు శాండిల్ వుడ్ పరిశ్రమను వణికిస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందా అని అందరూ భయపడిపోతున్నారు. ఇప్పటికే కన్నడ పరిశ్రమకు చెందిన సంజనా, రాగిణిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. మరో ఇద్దరికి సీసీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కన్నడ సినీ పరిశ్రమకు  చెందిన ప్రసిద్ధ జంట దిగంత్, ఐంద్రితా రైకు సిసిబి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిసిబి పోలీసులు దిగంత్ ఐంద్రితా రై లకు నోటీసులు జారీ చేసి బుధవారం ఉదయం 11 గంటలకు కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ ఫాజిల్‌లోని శ్రీలంక క్యాసినోకు ఐంద్రితా వెళ్లినట్లు చెబుతున్నారు.

2 Kannada Actors Summoned, Ex-Minister's Son Raided In Drugs Case

మాదకద్రవ్యాల కేసులో శాండిల్ వుడ్ హీరోయిన్లు  రాగిణి, సంజనలను ఇప్పటికే అరెస్టు చేశారు. రాగిణికి 14 రోజుల జైలు శిక్ష విధించబడింది. సంజన గల్రానీని సిసిబి పోలీసులు మూడు రోజుల పాటు అదుపులోకి తీసుకున్నారు.

నటుడు దిగంత్, నటి ఐంద్రితా రైకు సిసిబి ఇచ్చిన నోటీసులతో సినీ పరిశ్రమలో ఎక్కువ మంది నెట్‌వర్క్‌లో ఉన్నారనే టెన్షన్ పెంచింది. ఇదే కేసులోని ఎ -6 అయిన ఆదిత్య అల్వా రిసార్ట్‌పై ఈ ఉదయం సిసిబి పోలీసులు దాడి చేశారు. మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య ప్రస్తుతం కనిపించడంలేదు, అతడి కోసం అన్వేషణ కొనసాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios