డ్రగ్స్ కేసులో కన్నడ నటి సంజన గల్రాని అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆమె రేపటి వరకు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండనున్నారు. అందులో భాగంగా సంజనని పరప్పన అగ్రహార జైలుకి తరలించారు. 

అయితే ఈ జైలుకి తరలించే క్రమంలో సంజన మొండికేసింది. ఆమె వేసిన బెయిల్‌ పిటీషన్‌ రేపటి వరకు వాయిదా పడటంతో తప్పని పరిస్థితుల్లో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. దీంతో ప్రత్యేకమైన సెక్యూరిటీతో వైద్య పరీక్షలు చేయించి, ఆమెని పరప్పన జైలుకి తరలించారు. జైలు వద్దకు వెళ్ళాక పోలీస్‌ వ్యాన్‌ దిగేందుకు చాలా టైమ్‌ తీసుకుంది సంజన. కాసేపు విసిగించి నెమ్మదిగా దిగింది. 

వ్యాన్‌ దిగిన తర్వాత జైలు ద్వారం చిన్నగా ఉందని, నేను తలదించుకుని లోపలకి వెళ్ళను, మరో పెద్ద గేట్‌ ఓపెన్‌ చేయమని మొండికేసింది. దీంతో జైలు అధికారులు స్పందించి లోపలికి ఇలానే వెళ్ళాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాసేపు మొరాయించిన తర్వాత ఎట్టకేలకు లోపలికి వెళ్ళింది. జైలు లోపలికి వెళ్ళాక ఆమెని చూసి జైలు సిబ్బంది, ఖైదీలు ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. 

కర్నాటకలో డ్రగ్‌ కేసులో అరెస్ట్ అయిన సంజనని బుధవారం సాయంత్రం సీసీబీ పోలీసులు ఆమెని న్యాయస్థానంలో హాజరుపరచగా, రెండు రోజుల కస్టడీ విధిస్తూ ఒకటో ఏసీఎంఎం కోర్ట్ తీర్పు చెప్పింది. దీంతో సంజనని పరప్నన అగ్రహార జైలుకి తరలించారు. మరోవైపు ఈ డ్రగ్‌ కేసులోనే మరో నటి రాగిణి ద్వివేదికి రెండు వారాల కస్టడీకి తరలించిన విషయం తెలిసిందే.