ఆరడుగుల పురుగు.. పొట్టలో దూరింది

By Siva KodatiFirst Published Jul 7, 2019, 10:27 AM IST
Highlights

రోగి కడుపులో పురుగంటే ఏ మిల్లిమీటరో లేదంటే ఏ సెంటిమీటరో ఉంటుంది. అలాంటిది ఏకంగా 6.3 అడుగుల పొడవైన పొరుగు పేగుల్లో తిప్పేస్తూ ఉంటే ఆ వ్యక్తి పరిస్ధితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు

రోగి కడుపులో పురుగంటే ఏ మిల్లిమీటరో లేదంటే ఏ సెంటిమీటరో ఉంటుంది. అలాంటిది ఏకంగా 6.3 అడుగుల పొడవైన పొరుగు పేగుల్లో తిప్పేస్తూ ఉంటే ఆ వ్యక్తి పరిస్ధితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

వివరాల్లోకి వెళితే... హర్యానాలోని కైతల్ జిల్లా జింద్ నగరంలో నివసించే ఓ వ్యక్తి చాలా రోజుల నుంచి జ్వరం, కడుపునొప్పితో బాధపడేవాడు. ఎన్ని చోట్ల చికిత్స చేయించుకున్నా నొప్పి తగ్గలేదు.

దీంతో అతను జింద్‌లోని జైపుర్ ఆసుపత్రి వైద్యులను ఆశ్రయించాడు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. పేగుల్లో పురుగులు ఉన్నట్లుగా గుర్తించారు. శస్త్ర చికిత్స అనందరం పురుగులను తొలగించారు.

ఈ క్రమంలో ఓ పురుగు ఏకంగా 6.3 అడుగుల పొడవుతో డాక్టర్లను సైతం విస్మయానికి గురిచేసింది. అనంతరం బాధితుడు మాట్లాడుతూ.... వారం నుంచి ఏమీ తినాలనిపించేది కాదని.. 3 రోజుల తర్వాత కడుపులో నొప్పిగా అనిపించిందని... వైద్యులు శస్త్రచికిత్స చేసిన తర్వాత పురుగు బయటకు వచ్చింది.

ముందుగా చిన్నగానే కనిపించింది. తరువాత తీస్తున్న కొద్దీ వస్తూనే ఉందని... ఎంతో శ్రమించి పురుగును మొత్తం తొలగించారని తెలిపాడు. ఈ పురుగు శస్త్రీయ నామం ‘‘టినియా సోలియం’’ అని.. పచ్చి మాంసం, కూరగాయలను కడగకుండా తినడం వల్ల ఈ పురుగు నోటి ద్వారా ప్రేగుల్లోకి చేరే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.

click me!