రాహుల్‌కు మరో సమస్య.. రేప్ బాధితురాలి వివరాలు వెల్లడించాడని హైకోర్టులో పిటిషన్.. స్పందించాలని NCPCRకు ఆర్డర్

By Mahesh KFirst Published Mar 24, 2023, 6:18 PM IST
Highlights

రాహుల్ గాంధీకి మరో సమస్య ఎదురుగా వస్తున్నది. ఢిల్లీలో 2021 డిసెంబర్‌లో ఓ దళిత మైనర్ బాలిక రేప్ జరిగింది. హత్య కూడా జరిగింది. ఈ కేసులో బాధితురాలి గుర్తింపును రాహుల్ గాంధీ బహిర్గతం చేశారనే ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ ఫైల్ అయింది. ఈ పిటిషన్ పై స్పందించాలని ఎన్‌సీపీసీఆర్‌కు ఆదేశించింది.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి మరో సమస్య ఎదురవుతున్నది. ఓ మైనర్ బాలిక రేప్ కేసులో బాధితురాలి గుర్తింపును రాహుల్ గాంధీ వెల్లడించారని, ఆయనకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. ఈ పిటిషన్‌ను విచారిస్తూ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) స్పందించాలని ఆదేశించింది. జులై 27న ఈ పిటిషన్ విచారణ వాయిదా వేసింది.

సౌత్‌వెస్ట్ ఢిల్లీకి చెందిన ఓల్డ్ నంగాల్ గ్రామంలో 2021లో ఓ దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఆమె హత్యకు కూడా గురైంది. అయితే, రాహుల్ గాంధీ బాధితురాలి తల్లిదండ్రులతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

దీనిపై సోషల్ యాక్టివిస్ట్ మకరంద్ సురేశ్ మండ్లేకర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. లైంగిక దాడి బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచాలని, కానీ, రాహుల్ గాంధీ జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015ను ఉల్లంఘించాడని వాదించారు. 

అయితే, ఆ ట్వీట్‌ను తొలగించినట్టు ట్విట్టర్ తెలిపింది. వాటిని తొలగించినా.. ఆ వివరాలు ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయని ఎన్‌సీపీసీఆర్ పేర్కొంది. 

Also Read: రాహుల్ గాంధీ ముందున్న దారులేమిటీ? 8 ఏళ్లు ఎన్నికలకు దూరమేనా? కోర్టులో పిటిషన్ వేస్తారా?

కాగా, ట్విట్టర్ మాత్రం ఈ పిటిషన్‌లో పేర్కొన్న ట్వీట్‌ను ఎప్పుడో తొలగించామని వివరించింది. ఈ ట్వీట్‌ను జియో బ్లాక్ చేశామని, కాబట్టి, ఇండియాలో ఆ ట్వీట్ అందుబాటులో ఉండే అవకాశమే లేదని తెలిపింది. తొలుత ట్విట్టర్ ఖాతా మొత్తంగా తొలగించామని వివరించింది. ఆ తర్వాత ఆయన ఖాతా మళ్లీ రీస్టోర్ చేశామని పేర్కొంది.

click me!