
హిందువుల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ధర్మస్థలపై తప్పుడు ప్రచారం చేయడానికి కొందరు వ్యక్తులు పెద్ద కుట్ర చేశారన్న విషయం స్పష్టమవుతోంది. "నేను వందల సంఖ్యలో శవాలను అక్కడ పాతిపెట్టాను" అని ఒక వ్యక్తి చెప్పిన విషయమే ఈ కేసుకి కారణమైంది. కానీ ఇప్పుడు ఆ అబద్ధాల వెనుకున్న అసలు నిజం బయటపడుతోంది.
ఈ కేసులో అనామక సాక్షిగా ఉన్న వ్యక్తిని సి.ఎన్. చిన్నయ్య అలియాస్ చెన్న అని గుర్తించారు. ఆయన ఇప్పటివరకు SIT (ప్రత్యేక దర్యాప్తు బృందం)తో కలిసి కొన్ని ప్రదేశాలను చూపించాడు. కానీ, ఆయన చూపిన రెండు చోట్ల తప్ప మిగతా ఎక్కడా శవాలు లభించలేదు.
SIT ఆయనను ప్రశ్నించగా, "నేను పాత్రధారి మాత్రమే, నిజమైన కుట్రదారులు వేరే వారు ఉన్నారు" అని చెప్పాడు.
ఇలా మాట్లాడమని కొందరు తనకు చెప్పేరాని, అందుకే తాను కోర్టులో పుర్రెను సమర్పించానని తెలిపాడని వార్తుల వస్తున్నాయి. అయితే అసలు ఆ పుర్రె ఎక్కడి నుంచి వంచిందన్న విషయం కూడా తనకు తెలియదంటూ సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
తాను కోర్టుకు తీసుకెళ్లిన పుర్రె గురించి ఎన్ని ప్రశ్నలు అడిగినా, అది ఎక్కడి నుండి వచ్చిందో చెప్పేందుకు చెన్న నిరాకరించాడు. "నేను చూపించిన ప్రదేశంలోనే తవ్వకాలు చేయండి" అని పట్టుబట్టాడు. దీనితో SIT అధికారులు మరింతగా దర్యాప్తు చేసి, చివరికి ఆయన అబద్ధాలు వెలుగులోకి తెచ్చారు.
ధర్మస్థల వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఈ గ్యాంగ్‌లో మహేష్ శెట్టి తిమరోడి, ఎం.డి. సమీర్, సుజాతా భట్, చిన్నయ్య (చెన్న) పేర్లు బయటపడ్డాయి. వీరిపై పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ దుష్ప్రచారం ఎవరు మొదలు పెట్టారు.? అసలు దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటన్న విషయాలు తెలియాల్సి ఉంది.