డ్రగ్స్ కేసు: దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్ట్

By narsimha lodeFirst Published Jun 23, 2021, 4:40 PM IST
Highlights

అండర్ వరల్డ్ డాన్  దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ను ముంబైలోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు.

ముంబై: అండర్ వరల్డ్ డాన్  దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ను ముంబైలోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు.జమ్మూ కాశ్మీర్  నుండి పంజాబ్  కు నిషేధిత డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. కస్కర్ ను 2003లో యూఎఈ నుండి బహిష్కరించారు.

 

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ను ముంబైలోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. pic.twitter.com/LazjU02OiE

— Asianetnews Telugu (@AsianetNewsTL)

  25 కిలోలో నిషేధిత చరాస్ ను  ఆయన జమ్మూ కాశ్మీర్ నుండి  తరలిస్తుండగా పట్టుకొన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్ ను ముంబైలో సరఫరా చేసేందుకు ఆయన తీసుకొస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఓ దోపీడి కేసులో 2017 సెప్టెంబర్ మాసంలో థానే పోలీసులు కూడ కస్కర్ ను అరెస్ట్ చేశారు.  ఈ కేసులో  కస్కర్ ను  ఎన్సీబీ విచారించనున్నారు.  ఎవరి నుండి డ్రగ్స్ తీసుకొంటున్నారు, ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నారనే విషయమై ఎన్సీబీ విచారణ జరపనుంది.
 

 

 


 

click me!