Coronavirus: ప్రపంచదేశాలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ఇప్పటికీ ఖచ్చితమైన వివరాలు తెలియలేదు. అయితే, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమాచారం ఆధారంగా దీనిని ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. భారత్‌లో ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. కరోనా కొత్త కేసులు కాస్త తగ్గుతుండటం ఊరట కలిగిస్తున్నది.
Coronavirus: అన్ని దేశాల్లోనూ దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు నెలకొన్నాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. అయితే, కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే విషయం. శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 8,503 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. గురువారంతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. దీంతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,46,74,744కు చేరింది. ఇదే సమయంలో కొత్తగా 7,678 మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య మొత్తం 3,41,05,066కు పెరిగింది. యాక్టివ్ కేసులు సైతం లక్ష దిగువకు చేరుకున్నాయి. ప్రస్తుతం 94,943 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. వీరు వివిధ ఆస్పత్రులు, ఐసోలేషన్లు, హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.
Also Read: Summit for Democracy: భారత ప్రజాస్వామ్యానికి అవే మూల స్తంభాలు.. ప్రధాని మోడీ
undefined
అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 634 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త మరణాల్లో అధికంగా కేరళలో 225 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19తో చనిపోయిన వారి సంఖ్య 4,74,735కు పెరిగింది. మరణాల రేటు 1.35 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 98.4 శాతంగా ఉంది. వారంతపు కరోనా పాజిటివిటీ రేటు 5.3 శాతంగా ఉంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లు టాప్-10 లో ఉన్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ల నేపథ్యంలో కోవిడ్-19 పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికారులు వేగం పెంచారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 65,19,50,127 కరోనా శాంపిళ్లను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 12,89,983 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. వ్యాక్సినేషన్‌లోనూ అర్హులైన సగం మందికి పైగా టీకాలు పంపిణీ చేశామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 131.2 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. అందులో మొదటి డోసు తీసుకున్నవారు 81 కోట్ల మంది ఉండగా, పూర్తిగా (రెండు డోసులు) తీసుకున్న వారు 50.2 కోట్ల మంది ఉన్నారు.
Also Read: CPJ report: పెరుగుతున్న జర్నలిస్టుల జైలు నిర్బంధాలు
ఇదిలావుండగా, ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వరల్డో మీటర్ కరోనా వైరస్ డాష్‌బోర్డ్ వివరాల ప్రకారం.. అన్ని దేశాల్లో కలిపి ప్రస్తుతం 268,740,686 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 5,302,970 మంది వైరస్ కారణంగా మరణించారు. కోవిడ్-19 బారినపడ్డ వారిలో 241,855,202 మంది కోలుకున్నారు. కరోనా కేసులు,మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, అర్జెంటీనాలు టాప్-10లో ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దక్షిణాఫ్రికా, అమెరికాలో అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ వేరియంట్ 60 పైగా దేశాలకు వ్యాపించిందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Also Read: vijaya sai reddy: మోడీతో విజయసాయిరెడ్డి భేటీ.. రాష్ట్ర పెండింగ్ సమస్యలపై చర్చ