CPJ report: పెరుగుతున్న జర్నలిస్టుల జైలు నిర్బంధాలు
ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులను నిర్బంధించడం, వారిపై దాడులు చేయడం, ప్రాణాలు తీయడం వంటి చర్యలు అధికమవుతున్నాయని Committee To Protect Journalists (సీపీజే) నివేదిక పేర్కొంది. మరీ ముఖ్యంగా ఏడాదికేడాది ఈ చర్యలు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.
Committee To Protect Journalists: ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛపై దాడి కొనసాగుతున్నది. మరీ ముఖ్యంగా జర్నలిస్టులను నిర్బంధించడం, వారిపై దాడులు చేయడం, ప్రాణాలు తీయడం వంటి చర్యలు ఎక్కువ అవుతున్నాయని Committee To Protect Journalists (సీపీజే రిపోర్టు) తాజాగా నివేదిక పేర్కొంది. ఏడాదికేడాది ఈ ధోరణి క్రమంగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన సంవత్సరాలతో పోలిస్తే జైలు పాలవుతున్న పాత్రికేయుల సంఖ్య 2021లో రికార్డు స్థాయిలో పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. జర్నలిస్టులపై దాడులు, నిర్బంధాలకు సంబంధించిన అంశాలు ఒక్కొదేశంలో ఒక్కొ విధంగా, వేరు వేరు అంశాలతో ముడిపడి ఉన్నాయని తెలిపింది. అయితే, ఇందులో ముఖ్యంగా కామన్ విషయం ఆయా దేశాల్లో ప్రభుత్వాల లోపాలు, స్వతంత్ర రిపోర్టింగ్ చేయడం అలాంటివి ప్రధానంగా కనిసిస్తున్న అంశాలుగా ఉన్నాయని సీపీజే నివేదిక పేర్కొంది.
Also Read: vijaya sai reddy: మోడీతో విజయసాయిరెడ్డి భేటీ.. రాష్ట్ర పెండింగ్ సమస్యలపై చర్చ
గడిచిన సంవత్సరాలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా జైలు శిక్షను అనుభవిస్తున్న పాత్రికేయుల సంఖ్య ఈ ఏడాదిలో గరిష్ఠ స్థాయికి పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు (డిసెంబర్ 1) తీసుకున్న డేటా ప్రకారం మొత్తం 293 మంది జర్నలిస్టులు జైలులో నిర్బంధించబడ్డారు. అలాగే, వారు అందించిన వార్తల కవరేజీ కారణంగా దాడికి గురై 24 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మరో 18 మంది జర్నలిస్టులు వారి వృత్తి కారణంగా వారి ప్రాణాలు తీశారా? లేదా వారికి లక్ష్యంగా చేసుకుని చంపారా? అనేది నిర్ధారించడం కష్టంగా మారిన విషయాలను సైతం సీపీజే నివేదిక ప్రస్తావించింది. Committee To Protect Journalists రిపోర్టు ప్రస్తావించిన మరో ముఖ్యమైన విషయం 250 మందికి పైగా జర్నలిస్టులను జైలుపాలు చేయడం వరుసగా ఇది ఆరో ఏడాది కావడం ఆందోళన కలిగించే అంశమని చెప్పాలి.
Also Read: Omicron: ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే ఎక్కువే .. జపాన్ సైంటిస్టులు ఎమన్నారంటే?
Committee To Protect Journalists నివేదిక ప్రకారం అత్యధికంగా చైనాలో 50 మందికి పైగా జర్నలిస్టులను ఖైదు చేశారు. ఆ తర్వాతి స్థానంలో మయన్మార్ (26), ఈజిప్ట్ (25), వియత్నాం (23), బెలారస్ (19) దేశాలు ఉన్నాయి. ఈ సారి Committee To Protect Journalists నివేదిక హాంగ్ కాంగ్ జర్నలిస్టుల పరిస్థితులను సైతం తన నివేదికలో ప్రస్తావించింది. సీపీజే వారి వివరాలను తన నివేదికలో ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ఇక మెక్సికోలో జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశమని చెప్పాలి. ఎందుకంటే అక్కడి క్రిమినల్ ముఠాలు, అవినీతి అధికారుల చర్యలను జర్నలిస్టులు కవర్ చేసినప్పుడు వారిపై దాడులు జరగడంతో పాటు ఖైదు కూడా చేయబడుతున్నారు. పశ్చిమార్థ గోళంలోనే మెక్సికో జర్నలిస్టులకు అత్యంత దారుణమైన దేశంగా నిలిచిందని సీపీజే నివేదిక పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దారుణాలు కవర్ చేయడానికి వెళ్లిన భారత జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీని, మెక్సికోలో గుస్తావో సాంచెజ్ కాబ్రెరాను ఉగ్రవాదులు కాల్చిచంపారు. భారత్‌కు చెందిన మరో జర్నలిస్టు అవినాష్ జా (బీఎన్‌ఎన్ న్యూస్) మెడికల్ మాఫియాను కవర్ చేసినందుకు బీహార్‌లో ప్రాణాలు తీశారు. సుదర్శన్ టీవీకి చెందిన మనీష్ కుమార్ సింగ్ ఉగ్రవాద చర్యలను కవర్ చేయడంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలోనూ జర్నలిస్టులపై ఒత్తిడి తీసుకురావడం, ఖైదు చేయడం, దాడులు, చంపడం వంటి చర్యలు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: Telangana: తెలంగాణాలో పెరిగిన ఆత్మహత్యలు.. NCRB నివేదికలో షాకింగ్ విషయాలు !
ప్రపంచ దేశాల్లో రాజకీయ, ప్రభుత్వ వైఫల్యాలు, పలు ఘటనలపై స్వతంత్ర రిపోర్టు చేయడంతోటి జర్నలిస్టులను జైలులో పెట్టడం అనేది పాత్రికేయంపై పెరుగుతున్న అసహనాన్ని ప్రతిబింబిస్తున్నదని Committee To Protect Journalists నివేదిక పేర్కొంది. జర్నలిస్టులను అధికంగా రికార్డు స్థాయిలో జైలు నిర్బంధంలో పెట్టడం సీపీజే గుర్తించడం ఇది వరుసగా ఆరో ఏడాది అని సీపీజే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోయెల్ సైమన్ ఒక ప్రకటనలో తెలిపినట్టు రాయిటర్స్ నివేదించింది. ప్రభుత్వ సమాచారాన్ని నిర్వహించడం, నియంత్రించం అనే రెండు అంశాలే వారిని క్లిష్ట పరిస్థితుల్లోకి దించుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: Ponnala Lakshmaiah: లోపల దోస్తీ.. బయట కుస్తీ !