Bird flu : కేరళలో కలవర పెడుతున్న బర్డ్ ఫ్లూ.. కోళ్లు, బాతులు చంపాలని ఆదేశించిన అధికారులు...

Published : Dec 10, 2021, 11:21 AM IST
Bird flu : కేరళలో కలవర పెడుతున్న బర్డ్ ఫ్లూ.. కోళ్లు, బాతులు చంపాలని ఆదేశించిన అధికారులు...

సారాంశం

బర్డ్ ఫ్లూ ప్రబలకుండా నిరోధించేందుకు అధికారులు కోళ్లు, బాతులను చంపేందుకు వీలుగా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. అలప్పుజా జిల్లాలోని తకజీ పంచాయతీ కుట్టనాడ్ ప్రాంతంలో ఒక రైతు పెంచిన వేలాది బాతులు చనిపోయాయి. మరణించిన బాతుల శాంపిళ్లను భోపాల్ నగరంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ కు పంపించగా బర్డ్ ఫ్లూ అని నిర్థారించారు.  

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలోని కుట్టనాడ్ ప్రాంతంలో తాజాగా Bird flu cases వెలుగు చూశాయి. అల్లపుజాలోని కుట్టనాడ్ ప్రాంతంలో తాజాగా వెలుగు చూసిన బర్డ్ ఫ్లూ కేసులను అధికారులు ధృవీకరించారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లోని Chickens, ducksను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

బర్డ్ ఫ్లూ ప్రబలకుండా నిరోధించేందుకు అధికారులు కోళ్లు, బాతులను చంపేందుకు వీలుగా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. అలప్పుజా జిల్లాలోని తకజీ పంచాయతీ కుట్టనాడ్ ప్రాంతంలో ఒక రైతు పెంచిన వేలాది బాతులు చనిపోయాయి. మరణించిన బాతుల శాంపిళ్లను భోపాల్ నగరంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ కు పంపించగా బర్డ్ ఫ్లూ అని నిర్థారించారు.

సరిహద్దు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని Government of Kerala ఆదేశించింది. బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతంలోని కిలోమీటరు పరిధిలో ఉన్న బాతులు, కోళ్లు, గుడ్లు, ఇతర పక్షులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది కేరళలో బర్డ్ ఫ్లూ నిర్థారణ కావడం ఇది రెండోసారి. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో కేరళ రాష్ట్రంలో కలకలం రేగింది. 

ఇదిలా ఉండగా, నవంబర్ 30న కరోనా టీకా వేసుకోకుంటే ఉచిత చికిత్స అందించబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వార్నింగ్ ఇచ్చారు. అర్హులైన వారందరూ వెంటనే టీకా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు తప్పకుండా టీకా వేసుకోవాలని అన్నారు. లేదంటే ప్రతి వారం ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోవాలని, ఆ టెస్టు ఖర్చులనూ సొంతంగా భరించుకోవాలని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనలు పెరుగుతున్న తరుణంలో ఆయన ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దేశంలో తొలి కరోనా కేసు Keralaలోనే రిపోర్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఫస్ట్ వేవ్ అయినా సెకండ్ వేవ్ అయినా ఈ రాష్ట్రంలో కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పటికీ దేశంలో అత్యధిక కేసులు ఈ రాష్ట్రం నుంచే రిపోర్ట్ అవుతున్నాయి. అయితే, కేసులు అధికంగా రిపోర్ట్ అవుతున్నా.. మరణాలు స్వల్పంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు స్వల్పంగా వస్తున్నాయి. 

Summit for Democracy: భార‌త ప్ర‌జాస్వామ్యానికి అవే మూల స్తంభాలు.. ప్ర‌ధాని మోడీ

కరోనాను ఎదుర్కొనే ఏకైక ఆయుధం Vaccine అని తెలిసి కూడా చాలా మంది వెనుకడుగు వేస్తుండటం కేరళ ప్రభుత్వాన్ని అసంతృప్తికి గురి చేస్తున్నది. అందుకే కరోనా టీకా వేసుకోని వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించబోదని సీఎం Pinarayi Vijayan వార్నింగ్ ఇచ్చారు.

కరోనా వైరస్ New Variant Omicronతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని, కేసులు, నిఘా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేరళ సీఎం పినరయి విజయన్ ఈ రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో టీకా పంపిణీ వేగాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ఆయన కీలక ప్రకటన చేశారు. 

కరోనా టీకా వేసుకోవడానికి భయపడుతున్న వారికీ సరికొత్త నిబంధనలు విధించారు. అలర్జీ లేదా ఇతర వ్యాధుల కారణంగా టీకా వేసుకోవడానికి భయపడుతున్న వారు ప్రభుత్వ వైద్యులతో వాటిని వెల్లడించే సర్టిఫికేట్‌లను తీసుకోవాలని అన్నారు. టీకాలు ఇంకా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఆ సర్టిఫికేట్లను సమర్పించాలని అన్నారు. ఒక వేళ వారు టీకా వేసుకోకుంటే ప్రతి వారం ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోవాలని ఆదేశించారు. ఆ టెస్టు ఖర్చులనూ వారే సొంతంగా భరించుకోవాలని అన్నారు. ఆ టెస్టు రిపోర్టులను వెంటనే పై అధికారులకు సమర్పించాలని తెలిపారు. ఇది సదరు ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితితోపాటు పాఠశాలలు, కళాశాలల్లో చదివే పిల్లల ఆరోగ్యానికి ఉపకరిస్తుందని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
Zero Poverty Mission : యూపీలో పేదరికంపై యోగి ప్రభుత్వ నిర్ణయాత్మక పోరాటం