Bipin Rawat : ప్రమాదం తరువాత రావత్ బతికే ఉన్నారు.. చివరగా ఏమడిగారో తెలిస్తే కన్నీరాగదు..

By SumaBala BukkaFirst Published Dec 10, 2021, 11:53 AM IST
Highlights

వేరే పని కోసం నేను రోడ్డు మీద నడిచి వెళుతుండగా.. పలువురు హెలికాప్టర్ కూలిందని కేకలు పెట్టారు.వారితోపాటు నేనూ ఆ ప్రాంతానికి వెళ్లాను. చెట్టును ఢీ కొన్న హెలికాప్టర్ నుంచి మంటలు వస్తున్నాయి. అక్కడ ముగ్గురు కొన ప్రాణాలతో అల్లాడిపోవడం కనిపించింది. వారిలో ఒకరు తనను కాపాడాలని వేడుకుంటూ, తాగడానికి water ఇవ్వాలని సైగలు చేశారు. చుట్టూ పొదలు ఉండడంతో వెంటనే దగ్గరకు వెళ్లలేకపోయాను. 

హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న General Bipin Rawat తనను నీళ్లు కావాలని అడిగారని శివకుమార్ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సతర్వరం రక్షించేందుకు వీలు కాలేదని చెప్పారు. ఆయన అంత పెద్ద మనిషి అని అప్పుడు తెలియలేదని.. ఆ తర్వాత ఎవరో ఫొటో చూపించినప్పుడు తెలిసిందన్నారు. 

తలుచుకుంటే బాధనిపిస్తోందని, ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్ స్థానిక కాంట్రాక్టర్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రావత్ దంపతులు సహా 13 మందిని బలిగొన్న Helicopter crashకి ఆయన ప్రత్యక్ష సాక్షి. ‘వేరే పని కోసం నేను రోడ్డు మీద నడిచి వెళుతుండగా.. పలువురు హెలికాప్టర్ కూలిందని కేకలు పెట్టారు.

వారితోపాటు నేనూ ఆ ప్రాంతానికి వెళ్లాను. చెట్టును ఢీ కొన్న హెలికాప్టర్ నుంచి మంటలు వస్తున్నాయి. అక్కడ ముగ్గురు కొన ప్రాణాలతో అల్లాడిపోవడం కనిపించింది. వారిలో ఒకరు తనను కాపాడాలని వేడుకుంటూ, తాగడానికి water ఇవ్వాలని సైగలు చేశారు. చుట్టూ పొదలు ఉండడంతో వెంటనే దగ్గరకు వెళ్లలేకపోయాను. ఇంతలో భద్రతా దళాలు అక్కడకు చేరుకుని ఆయనను, మరొకరిని దుప్పట్లలో చుట్టి అక్కడినుంచి తీసుకుపోయాయి.  ఆ తరువాత తెలిసింది. ఆయనే బిపిన్ రావత్’ అని shiva kumar పేర్కొన్నారు.

కాగా, బిపిన్ రావత్ చివరి క్షణాల్లో హిందీలో మాట్లాడారని, ‘నేనే బిపిన్ రావత్’ని అంటూ నెమ్మదిగా పలికారని సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అవే ఆయన చివరి మాటలు. 

కాగా, రెండు రోజుల క్రితం విమాన ప్రమాదంలో భారత ఆర్మీ చరిత్ర‌లో ప్రఖ్యాతి గాంచిన వీర యోధుడు తొలి సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) బిపిన్‌ రావత్  హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాశారు. తమిళనాడులోని నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో  ప్రమాదంలో చోటు చేసుకుంది.  ఈ ఘ‌ట‌న‌లో  త్రిదళాధిపతి (సీడీఎస్​) జనరల్ బిపిన్ రావత్​, ఆయన సతీమణి మధులికతో పాటు 11మంది సైనికాధికారులు సైతం దుర్మరణం చెందారు. 

CDS Gen Bipin Rawat: నేడు బిపిన్ రావత్ అంత్యక్రియలు.. హాజ‌రు కానున్న‌ శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీఅధికారులు

ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నేడు బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు ఢిల్లీలో ఇవాళ జరగనున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్​లోని బ్రార్ స్క్వేర్​ స్మశానవాటికలో వీరికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

దేశ సైనిక బలగాలకు కొత్త రూపుతెచ్చిన రావత్ ఆక‌స్మిక మరణంతో దేశం దిగ్భ్రాంతి చెందింది. పలువురు ప్రముఖులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు.  జనరల్ బిపిన్ రావత్​, మధులికా రావత్​ల భౌతిక దేహాలను గురువారం సాయంత్రం తమిళనాడు నుంచి సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం వారి నివాసంలోనే భౌతిక దేహాలను ఉంచారు.

రావత్ దంప‌తుల పార్దీవ దేహాల‌ను చూడటానికి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సాధారణ ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించనున్నారు. ఆ తర్వాత 2 గంటల నుంచి రావత్‌ దంపతులఅంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఈ అంతిమ యాత్ర‌.. కామరాజ్ మార్గ్ ద్వారా కంటోన్మెంట్​లోని స్మశాన వాటిక వరకు  సాగుతోంది. 

సైనిక లాంఛనాలతో బిపిన్‌రావత్‌ దంపతుల అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రావ‌త్ అంతక్రియ‌ల‌కు శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌ ఆర్మీ అధికారులుహాజరు కానున్నారు.
 

click me!