దేశంలో కొత్త‌గా ఎన్ని క‌రోనా కేసులు న‌మోదయ్యాయంటే..

By team telugu  |  First Published Dec 3, 2021, 10:57 AM IST

యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి సంక్షోభంలోకి నెట్టింది.  కొత్త కొత్త వేరియంట్ల‌తో ప‌రిస్థితుల‌ను మ‌రింత దారుణంగా మార్చింది. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాలో ఇటీవ‌ల వెలుగుచూసిన క‌రోనా మ‌హ‌హమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. భార‌త్‌లోనూ ఈ ర‌కం కేసులు న‌మోదుకావ‌డంతో క‌ల‌వ‌రం మొద‌లైంది. 
 


గ‌తేడాది చైనాలోని వూ|హాన్‌లో వెలుగుచూసిన క‌రోనా మ‌హ‌మ్మారి అతి త‌క్కువ కాలంలోనే యావ‌త్ ప్ర‌పంచాన్ని చుట్టుముట్టేసింది. భార‌త్‌లోనూ దీని ప్ర‌భావం అధికంగానే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు త‌గ్గుముఖం ప‌డుతూ వ‌స్తున్న క‌రోనా కొత్త కేసులు మ‌ళ్లీ నెమ్మ‌దిగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌రీ ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం భార‌త్‌లో న‌మోదుకావ‌డంతో  కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల అమ‌లు విష‌యంలో క‌ఠినంగా ముందుకు సాగుతున్నాయి.  తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 9,216 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో మొత్తం కేసులు 3,46,15,757కు చేరాయి. ప్ర‌స్తుతం 99,976 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు.  అలాగే, కొత్త‌గా 8612 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కోవిడ్‌-19 నుంచి బయటప‌డిన వారి సంఖ్య 3,40,45,666 కు పెరిగింది. 

Also Read: దేశంలోనే అతిపెద్ద సైబ‌ర్ మోసం.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

Latest Videos

undefined

గ‌త 24 గంట‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి పోరాడుతూ.. 391 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భార‌త్‌లో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,70,115కు పెరిగింది.  తాజా మ‌ర‌ణాల్లో అధికంగా కేర‌ళ‌లోనే న‌మోద‌య్యాయి.  ఇక క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో.. మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లు టాప్‌-10 జాబితాలో ఉన్నాయి.  వీటిలో అధికంగా మ‌హారాష్ట్రలో 66,37,221 కేసులు, 1,42,049 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.  ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్న కేర‌ళ‌లో 5151919 కేసులు, 40,855 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.  ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.2 శాతంగా ఉంది. మ‌ర‌ణా రేటు 1.34 శాతంగా ఉంది.  దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 64,35,10,926 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. గురువారం ఒక్క‌రోజే 10,98,611 ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు తెలిపింది. 

Also Read: పెరిగిన ప్ర‌జా ఫిర్యాదులు.. పార్ల‌మెంట్ నాల్గో రోజు అంశాలివిగో !

క‌రోనా కొత్త వేరియంట్ హెచ్చ‌రిక‌లు నేప‌థ్యంలో అధికార యంత్రాంగం మ‌రింత‌గా అప్ర‌మ‌త్త‌మైంది. ఈ క్ర‌మంలోనే వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను మ‌రింత వేగ‌వంత చేసే దిశ‌గా ముందుకు సాగుతున్నారు. ఇక గురువారం నాగు మొత్తం 73,67,230 డోసుల వ్యాక్సిన్లు అందించామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,25,75,05,514 క‌రోనా డోసుల వ్యాక్సిన్లు వేశామ‌ని తెలిపింది. 

Also Read: ఇంటర్నెట్ సస్పెన్షన్.. దేశానికి అప్ర‌తిష్ట !

ఇదిలావుండ‌గా, ప్ర‌ప‌పంచ‌వ్యాప్త‌గా కూడా క‌రోనాన కొత్త కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్‌గా భావిస్తున్న క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్  కేసులు సైతం పెరుగుతుండ‌టం పై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త మ‌వుతోంది. అన్ని దేశాల్లో  క‌లిపి ఇప్ప‌టివ‌రకు మొత్తం 264,473,438 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, వైర‌స్‌తో పోరాడుతూ 5,250,054 మంది ప్రాణాలు కోల్పోయారు.  238,491,434 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అత్య‌ధికంగా కేసులు, మ‌ర‌ణాలు న‌మోదైన దేశాల జాబితాలో అమెరికా, భార‌త్‌, బ్రెజిల్‌, యూకే, ర‌ష్యా, ట‌ర్కీ, ఫ్రాన్స్, ఇరాన్‌, జ‌ర్మ‌నీ, అర్జెంటీనాలు టాప్‌-10లో ఉన్నాయి.  ప్ర‌స్తుతం బెల్జియంలో నిత్యం 20 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టంపై అక్క‌డి ప్ర‌భుత్వం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. 

Also Read: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో స్కూల్స్ బంద్.. ప‌రీక్ష‌ల్లేవ్‌.. ఎందుకంటే?

click me!