వేలాదిమంది యువతులను వ్యభిచారంలోకి దింపిన ఘరానా జంట.. అనుకోకుండా పట్టుబడి...

By SumaBala BukkaFirst Published Dec 3, 2021, 10:34 AM IST
Highlights

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని  ఇండోర్ నగరంలో ఒక వ్యభిచార ముఠాని పోలీసులు పట్టుకున్నారు.  ఆ ముఠా నాయకుడితో సహా ఎనిమిది మందిని పోలీసులు పట్టుకున్నారు. ఒక  హవాలా (Money laundering)కేసులో పోలీసులు విచారణ చేస్తుండగా…  ఈ ముఠా గురించి పోలీసులకు తెలిసింది.  

మధ్యప్రదేశ్ : అతడు బంగ్లాదేశ్ కి చెందిన ఓ దళారీ. రెండు దశాబ్దాల క్రితమే భారతదేశానికి వచ్చి పేరు మార్చుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. Bangladesh నుంచి వేలాది మంది Young womenలను తీసుకొచ్చి Prostitution చేయించేవాడు. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు యువతులను సరఫరా చేసేవాడు. అనుకోకుండా ఒక నేరంలో పోలీసులు అతడిని పట్టుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్టుగా అతడి వ్యవహారం అంతా బయట పడింది. అసలేం జరిగిందంటే…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని Indore cityలో ఒక వ్యభిచార ముఠాని పోలీసులు పట్టుకున్నారు.  ఆ ముఠా నాయకుడితో సహా ఎనిమిది మందిని పోలీసులు పట్టుకున్నారు. ఒక  హవాలా (Money laundering)కేసులో పోలీసులు విచారణ చేస్తుండగా…  ఈ ముఠా గురించి పోలీసులకు తెలిసింది.  నేరస్తులను గురించి పోలీసులు మరింత విచారణ చేయగా.. ఆ ముఠా నాయకుడి గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల కథనం ప్రకారం..  మామున్  హుస్సేన్ (41) బంగ్లాదేశ్ నుంచి 25 సంవత్సరాల క్రితం భారతదేశం వచ్చాడు. Mamun Hussain  తన పేరు  విజయ్ దత్ గా మార్చుకుని ముంబైలో స్థిరపడ్డాడు.  అతనికి ఇంతకుముందే బంగ్లాదేశ్లో వివాహమైనా.. భారత్ లో కూడా మరో వివాహం చేసుకున్నాడు. ఇక్కడే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు అన్నీ చేయించుకున్నాడు. 

కేఏఎస్ అధికారి నాగరాజు ఇంటిపై ఏసీబీ దాడులు.. గుండెపోటుతో భార్య మృతి..

బంగ్లాదేశ్ నుంచి గత 20 సంవత్సరాలుగా యువతులను తీసుకువచ్చి పడుపు వృత్తిలోకి దింపుతున్నాడు. ఈ వ్యవహారంలో అతడి మొదటి భార్య బంగ్లాదేశ్ నుంచి కార్యకలాపాలు నిర్వహించేది. బంగ్లాదేశ్ లో ఆమె తను ఒక ప్రభుత్వ అనుబంధ సేవా సంస్థ నడుగుతున్నానని చెప్పి పేద, ఒంటరిగా ఉన్న యువతుల వద్దకు వెళ్ళేది. వారికి భారత్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించేది.

అలా మామున్  హుస్సేన్, అతడి భార్య భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో తమ ఏజెంట్లను నియమించుకొని బంగ్లాదేశ్ నుంచి యువతులను ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి వ్యభిచారం  చేయించేవారు. ఈ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బులతో పాటు.. బడాబాబుల వద్ద నుంచి నల్లధనం తీసుకొని హవాలా వ్యాపారం చేసేవారు.

హైఅలెర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పెను తుఫానుగా మారే ఛాన్స్..

అనుకోకుండా ఇండోర్ నగరంలో ఈ హవాలా కార్యకలాపాలు వెలుగుచూడటంతో పోలీసులు మామున్  హుస్సేన్ తో పాటు ఏడుగురు నేరస్తులను అరెస్టు చేశారు. అతడి గురించి విచారణ చేయగా.. ఈ వ్యభిచార వ్యాపారం గురించి తెలిసింది.  దశాబ్దకాలంలో వేలాది మంది యువతులను బంగ్లాదేశ్ నుంచి తీసుకువచ్చి వ్యభిచారం  చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. 

ఒకేసారి వేలాదిమంది యువతులకు సంబంధించిన వ్యభిచార ముఠా గుట్టు రట్టవ్వడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దారుణ ఘటన వెనుక పక్కా ప్లాన్ తోనే గత పాతికేళ్లుగా చక్రం తిప్పుతున్న మామున్ హుస్సేన్, అతని బంగ్లాదేశ్ భార్య గురించి అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.

click me!