కేఏఎస్ అధికారి నాగరాజు ఇంటిపై ఏసీబీ దాడులు.. గుండెపోటుతో భార్య మృతి..

By SumaBala BukkaFirst Published Dec 3, 2021, 9:52 AM IST
Highlights

 గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా ఆమెకు heart attack వచ్చింది. బెంగళూరు కొలంబియా ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతి చెందింది. తమ ఇంటిపై వరుసగా మూడోసారి ఏసీబీ దాడి జరగడంతో ఆమె ఆ రోజే మీడియా ముందు బోరున విలపించింది. 

బెంగళూరు :  నేలమంగల పట్టణంలోని kas officer nagaraju భార్య గుండెపోటుతో గుండెపోటుతో మృతి చెందింది. నాగరాజు ఇంటిపై ఇటీవలే ACB అధికారులు దాడి చేసి కోట్ల విలువైన నగదు, నగలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఆ రోజు నుంచి భార్య నాగరత్న దిగులుగా ఉంటోంది. గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా ఆమెకు heart attack వచ్చింది. బెంగళూరు కొలంబియా ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతి చెందింది. తమ ఇంటిపై వరుసగా మూడోసారి ఏసీబీ దాడి జరగడంతో ఆమె ఆ రోజే మీడియా ముందు బోరున విలపించింది. 

ఇదిలా ఉండగా, ఇటీవలే కర్ణాటకలో ఏసీబీ అధికారులు భారీ అవినీతి తిమింగళాలను పట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి భారీగా జీతభత్యాలు వస్తున్నా కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన సంపాదిస్తున్నారు. లక్షలు, కోట్లలో bribe వసూలు చేస్తూ వాటిని దాచేందుకు తిప్పలు పడుతున్నారు. ఇంటి గోడల్లోనో, బాత్‌రూమ్‌లోనో ఆ డబ్బును దాచిన ఘటనలు మనం ఎన్నో చూశాం కానీ అన్నింటికీ భిన్నంగా, వినూత్నంగా ఉంది ఇది.

ఆ పార్టీకి విప‌క్షాల‌కు నాయకత్వం వ‌హించే హ‌క్కులేదు.. ప్రశాంత్ కిశోర్ హాట్ కామెంట్స్..

తాజాగా కర్ణాటకలో ఓ అధికారి ఏకంగా తన అవినీతి సంపాదనను పైప్‌లైన్‌లో దాచి వుంచాడు. అయినప్పటికీ Anti Corruption Bureau అధికారులు దానిని పట్టేశారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారుల ఇళ్లల్లో ఏసీబీ నవంబర్ 24, బుధవారంనాడు సోదాలు జరిపింది. 

ఈ నేపథ్యంలో Kalaburagi జిల్లా పీడబ్ల్యూడీ జాయింట్‌ ఇంజినీర్‌ శాంతా గౌడ్‌ బిరదర్‌ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు అతడి అక్రమ సంపాదన చూసి అవాక్కయ్యారు. ఈ సోదాల్లో ఆయన ఇంట్లో రూ. 25 లక్షల నగదు, పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. శాంతాగౌడ్‌ తన ఇంట్లో ఉన్న పైపులైన్లలో నగదు దాచి ఉంచాడన్న సమాచారం అందుకున్న అధికారులు.. ఓ ప్లంబర్‌ను తీసుకొచ్చి వాటిని పగులగొట్టించారు. 

Antique Coins: భారీగా బ‌య‌ట‌బ‌డ్డ పురాత‌న నాణేలు.. ఎక్క‌డంటే?

దీంతో పైపులైన్‌ నుంచి కరెన్సీ నోట్లు కిందకు పడటం చూసి అధికారులు అవాక్కయ్యారు. నల్లధనం కోసమే ఈ పైపులను ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు ఏసీబీ అధికారులు  గుర్తించారు.  కాగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది అధికారులకు సంబంధించిన నివాసాలపై ఏసీబీ అధికారులు 60 చోట్ల సోదాలు చేశారు. 

click me!