పరస్పర ఇష్టంతో సెక్స్ లో పాల్గొంటే పోక్సో చట్టం ప్రకారం ‘లైంగిక వేధింపులు’ అనలేము - మేఘాలయ హైకోర్టు

By team teluguFirst Published Nov 2, 2022, 4:45 AM IST
Highlights

మైనర్ బాలిక, బాలుడు పరస్పర ఆప్యాయతతో, ఇష్టంతో సెక్స్ లో పాల్గొంటే దానిని లైంగిక వేధింపులుగా పరిగణించలేమని మేఘాలయా కోర్టు తెలిపింది. ఈ సందర్భంలో పోక్సో చట్టం వర్తించదని పేర్కొంది. 

లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం) ప్రకారం యువ జంట మధ్య పరస్పర ప్రేమ, ఆప్యాయతతో కూడిన చర్యలను ‘లైంగిక వేధింపులు’గా పరిగణించబోమని మేఘాలయ హైకోర్టు మంగళవారం పేర్కొంది. తనపై ప్రియురాలి తల్లి దాఖలు చేసిన అభియోగాలను రద్దు చేయాలంటూ కోరుతూ ఓ బాలుడు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.

ఛత్ ఉత్సవాల్లో నీటిలో మునిగి 53 మంది మృతి.. బీహర్ లో ఘటన

ఓ మైనర్ బాలిక పాఠశాలలో తన టీచర్‌తో కలిసి నివసించేది. అయితే గదిలో ఉండాల్సిన బాలిక ఒక రోజు కనిపించకుండా పోయింది. దీనిని ఆ టీచర్ గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని బాలిక తల్లికి తెలియజేసింది. అయితే ఆ బాలిక తన ప్రియుడితో శారీరకంగా సంబంధం కలిగి ఉందని తల్లి గుర్తించింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 5(ఎల్)/6 కింద పోలీసులు బాలుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తక్కువ లోతులో నీరు, నది అడుగులో రాళ్లే ప్రాణ నష్టానికి కారణం.. గుజరాత్ బ్రిడ్జి విషాదంపై ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్

అనంతరం అతడిని అరెస్టు చేశారు. పది నెలల పాటు జైలులో ఉండి బెయిల్ పై విడుదల అయ్యాడు. కాగా.. కోర్టులో కేసు విచారణ సందర్భంగా నిందితుడితో తనకు శారీరక సంబంధాలున్నాయని బాలిక అంగీకరించింది. తాము ఏకాభిప్రాయంతో కలిశామని పేర్కొంది. తన ఇష్ట ప్రకారమే అది జరిగిందని మైనర్ బాలిక తన వాంగ్మూలంలో మెజిస్ట్రేట్ ఎదుట అంగీకరించింది.

జమ్మూ కాశ్మీర్ లో జాయింట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులు హతం..

కాగా.. తక్కువ వయస్సు గల బాధితులపై లైంగిక వేధింపులు కలిగించే లోతైన మానసిక ఆవేదనను, తీవ్ర ప్రభావాన్ని పరిష్కరించడానికి శాసనసభ్యులు పోక్సో చట్టాన్ని కఠినంగా చేశారని కోర్టు గుర్తించింది. అయితే ఈ కేసులో ప్రియుడు, ప్రియురాలు ప్రేమలో మునిగితేలి ఈ చర్యకు పూనుకున్నారు కాబట్టి పోక్సో చట్టాన్ని ప్రయోగించలేమని న్యాయస్థానం పేర్కొంది. కేసు కొట్టివేస్తే న్యాయానికి మేలు జరుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.

Bharat Jodo Yatra: చార్మినార్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాహుల్ గాంధీ

అనంతరం న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, న్యాయస్థానం నిందితుడైన బాలనేరస్థుడిపై కేసును కొట్టి వేస్తూ.. పిల్లలు, పెద్దల మధ్య పరస్పర ప్రేమ, ఆప్యాయత ఉన్న సందర్భంలో లైంగిక వేధింపుల నేరాన్ని ప్రాసిక్యూట్ చేయవచ్చని పేర్కొంది. కానీ కొన్ని ప్రత్యేక
సందర్భాలు, పరిస్థితిల్లో ప్రియుడు, ప్రియురాలు చిన్నవయస్సులో ఉండి, వారి మధ్య ఆప్యాయతతో చర్య జరిగితే దానిని ‘లైంగిక దాడి’ కేసుగా పరిగణించలేమని తెలిపింది. అనంతరం అతడిని అన్ని నేరారోపణల నుంచి విముక్తి చేసింది.

click me!