విప్లవాత్మక అడుగు..  సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభించిన సీజేఐ 

By Rajesh KarampooriFirst Published Dec 7, 2022, 2:00 PM IST
Highlights

అదనపు ఫీచర్లతో కూడిన సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 సిద్ధంగా ఉందని, ఇది అన్ని లా ఆఫీసర్లు , ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ బుధవారం ప్రకటించారు. కొత్త వెర్షన్ యాప్‌తో ప్రభుత్వ శాఖలు తమ పెండింగ్ కేసులను చూడవచ్చని సీజేఐ తెలిపారు.

Supreme Court Mobile App 2.0 : రోజురోజు మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా సుప్రీంకోర్టు కూడా అప్ డేట్ అవుతుంది. అదనపు ఫీచర్లతో కూడిన సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ను బుధవారం (డిసెంబర్ 7)  ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా  న్యాయ అధికారులు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల నోడల్ అధికారులు తమ కోర్టు కార్యకలాపాలను నిజ సమయంలో వీక్షించవచ్చు. మొబైల్ అప్లికేషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ బుధవారం ప్రారంభించారు.

గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఐఓఎస్ వెర్షన్ వారంలో అందుబాటులోకి వస్తుందని  సీజేఐ డివై చంద్రచూడ్ తెలిపారు. ఈ సదుపాయాన్ని విప్లవాత్మక అడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ యాప్ ద్వారా  న్యాయవాదులు, న్యాయ అధికారులు, నోడల్ ఆఫీసర్లు  ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో రియల్ టైమ్ యాక్సెస్‌ను కేంద్రం కల్పిస్తుందని సీజేఐ చెప్పారు. అలాగే.. వారు ఈ అప్లికేషన్ ద్వారా లాగిన్ అయి కోర్టు వ్యవహారాలను చూడవచ్చని తెలిపారు.

రాజ్యాంగ దినోత్సవం రోజున ఈ-కోర్టు ప్రాజెక్టు ప్రారంభం.

నవంబర్ 26న జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ 'వర్చువల్ జస్టిస్ క్లాక్', 'జస్టిస్' మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్ వెబ్‌సైట్‌లను ప్రారంభించారు. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ప్రధాన న్యాయమూర్తిగా ప్రతి భారతీయుడికి న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం తన బాధ్యత అని అన్నారు. సుప్రీంకోర్టు, జిల్లా స్థాయి కోర్టులు సమైఖ్యంగా పని చేయాలని పేర్కొన్నారు.  ఏ నాగరిక దేశానికైనా న్యాయస్థానాలు ప్రజలకు చేరువ కావడం అవసరమని సీజేఐ అన్నారు. అంటే, ప్రజలు కోర్టు హాలుకు వచ్చే వరకు వేచి ఉండకండని అన్నారు. 
 
అప్‌డేట్ చేయబడిన యాప్ సారాంశం ప్రకారం.. కేంద్ర మంత్రిత్వ శాఖ యొక్క నోడల్ అధికారులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులు, స్టేటస్ ఆర్డర్‌లు, తీర్పులు , దాఖలు చేసిన ఏవైనా ఇతర పత్రాలను వీక్షించవచ్చు.2021లో మహమ్మారి సమయంలో కోర్టు ప్రాంగణాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా జర్నలిస్టులు సుప్రీంకోర్టు కార్యకలాపాలను నివేదించడానికి వీలుగా సుప్రీంకోర్టు మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది.

click me!