సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు

By telugu teamFirst Published Jul 30, 2019, 3:34 PM IST
Highlights

సోమవారం సాయంత్రం నేత్రావది నది సమీపంలో ఆయన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. వ్యాపారంలో నష్టపోయాననే బాధతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన అదృశ్యం కావడానికి ముందు కంపెనీ ఉద్యోగులకు లేఖ రాయడంతో ఈ అనుమానానికి బలం చేకూరుతోంది.

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని హాసన్ లో ఉన్న కాఫీడే గ్లోబల్ లిమిటెడ్ కు సెలవు ప్రకటించారు. యజమాని అదృశ్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా... ఆయన సురక్షితంగా రావాలని కంపెనీ ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సోమవారం సాయంత్రం నేత్రావది నది సమీపంలో ఆయన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. వ్యాపారంలో నష్టపోయాననే బాధతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన అదృశ్యం కావడానికి ముందు కంపెనీ ఉద్యోగులకు లేఖ రాయడంతో ఈ అనుమానానికి బలం చేకూరుతోంది. అతని ఫోన్ కాల్ డేటా తదితర అంశాలను పరిశీలిస్తున్నారు.

కాగా.. కాఫీడే ఉద్యోగులు.. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు రాసి లేఖలో సిద్ధార్ధ పలు విషయాలు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. 37 ఏళ్ల నా కృషిలో 30 వేలమందికి ప్రత్యక్షంగా.. 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే ఇప్పుడు ఎన్నో మంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వ్యాపారాన్ని లాభసాటిగా సృష్టించడంలో విఫలమవుతున్నానన్నారు. ఇక తనకు పోరాడే ఓపిక లేదని.. అందుకే అన్ని వదిలేస్తున్నానని.. ఓ ప్రైవేట్ ఈక్విటీలో భాగస్వాములు షేర్లను బైబ్యాక్ చేయమని తనను బలవంత పెడుతున్నారని.. ఇక ఆ ఒత్తిడిని తాను తీసుకోవాలనుకోవట్లేదన్నారు.

ఆదాయపు పన్ను మాజీ డీజీ ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని.. తనపై మీరంతా బలంగా ఉండి ఈ వ్యాపారాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నా.. నా తప్పులన్నింటికీ నాదే బాధ్యత.. నా లావాదేవీల గురించి మా మేనేజ్‌మెంట్‌కు, ఆడిటర్లకు తెలియదు.. వాటన్నింటికి నేనే జవాబుదారిని, నేను ఎవరినీ మోసం చేయాలనుకోలేదు. నేనొక అసమర్థ వ్యాపారవేత్తని.. నన్ను క్షమించండి అంటూ సిద్ధార్థ లేఖలో పేర్కొన్నారు.

related news

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

click me!