ఒక్క భార‌త్ లోనే కాదు విదేశాల్లోనూ అయోధ్య రామ‌య్య ప్రాణప్రతిష్ఠ వేడుకలు !

By Mahesh RajamoniFirst Published Jan 22, 2024, 3:59 PM IST
Highlights

Ayodhya Ram Mandir Pran Pratishtha: అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మంగా ఘ‌నంగా పూర్త‌యింది. అయితే, భార‌త్ లోనే కాకుండా విదేశాలలో కూడా అయోధ్య రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట వేడుకలు, కాషాయ జెండాలు ఊరేగింపులు, రామ భజన కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.
 

Ayodhya Ram Lalla Pran Pratishtha: అయోధ్య రామ మందిరం రామ్ ల‌ల్లా ప్రాణ్ ప్రతిష్ఠను దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్‌లలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వ‌హించారు. డిజిటల్ ట్రక్‌లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి చిత్రాలతో పాటు రాముడి జీవిత కథ వీడియోలు ప్లే చేస్తున్నారు. సోమ‌వారం మ‌ధ్య‌హ్నం అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మంగా ఘ‌నంగా పూర్త‌యింది. 

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్స‌వానికి కొన్ని గంటల ముందు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రామనామ మంత్రోచ్ఛరణలు మారుమోగుతున్నాయి. కాలిఫోర్నియాలోని రామాలయం చిత్రంతో కూడిన కాషాయ జెండాల‌తో 1,100 మంది రైడర్లు భారీ కార్ ర్యాలీలో పాల్గొన్నారు. రాముని పాటలపై సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో 'కార్ ర్యాలీ' ఐకానిక్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, శాన్ ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీలోని వివిధ ప్రాంతాల గుండా సాగింది. కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ, టెస్లా కార్ లైట్ షోలో రామ్ ల‌ల్లా ప్ర‌త్యేకంగా ఆక‌ర్ష‌ణగా ఉన్నారు.

Latest Videos

11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోడీ.. ఈ స‌మ‌యంలో ఏం చేశారో తెలుసా?

 

More than 900 cars for a rally in Silicon Valley for Rama Lala civilization survival victory pic.twitter.com/6Kcd2jADBz

— DD News (@DDNewslive)

భారీ రామ్‌రథ్ నేతృత్వంలో ర్యాలీ సుమారు 100 మైళ్ల దూరం సాగింది. ర్యాలీకి భద్రతా క‌ల్పించ‌డం కోసం రెండు పోలీసు కార్లు ర్యాలీకి తోడుగా ఉన్నాయి. ర్యాలీలో 3 డిజిటల్ ట్రక్కులు కూడా ఉన్నాయి, వీటిలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుల జీవిత చిత్రాలతో పాటు రాముడి జీవిత కథ వీడియోలు ప్లే చేయబడ్డాయి. ఈ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. 

 

VIDEO | Shri Ram car rally organised at California’s Golden Gate Bridge in view of ceremony in Ayodhya tomorrow. pic.twitter.com/ny3hKroU6x

— Press Trust of India (@PTI_News)

 
కాషాయ జెండాలు ఊపుతూ, రామభజనలు పాడుతూ..

2,000 మందికి పైగా రామ భక్తులు కాషాయ జెండాలు ఊపుతూ, రామభజనలు పాడుతూ, డ్రమ్స్ వాయిస్తూ, ఆ ప్రాంతాన్ని మినీ-అయోధ్యగా మార్చారని కీలక నిర్వాహకురాలు దీప్తి మహాజన్ తెలిపారు. అమెరికాలో హిందువులు నిర్వహించిన ఈ రకమైన మొదటి ర్యాలీ ఇది. ర్యాలీలో పాలుపంచుకున్న వారు భావోద్వేగంతో.. చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు.

ఇస్లాం జెండాల‌తో అయోధ్య‌ రామ మందిరం ఫోటో ఎడిట్.. ఓ యువ‌కుడు అరెస్టు

click me!