అతిక్ అహ్మద్ ఆఫీసు ఎదుట హారన్ కొట్టినా.. బంధించి టార్చర్ పెట్టేవాడు - డాన్ హింసలు గుర్తు చేసుకున్న మహిళా రైతు

By Asianet News  |  First Published Apr 23, 2023, 3:06 PM IST

అతిక్ అహ్మద్ ఎంతో క్రూరుడని 50 ఏళ్ల మహిళా రైతు గుర్తు చేసుకున్నారు. అతడి ఆఫీసు ఎదుట హారన్ కొట్టిన వారిన బంధించి చిత్రహింసలు పెట్టేవాడని పేర్కొంది. తన ఆస్తి కోసం అతిక్ అహ్మద్ 35 ఏళ్లుగా పోరాటం చేశానని చెప్పారు. 


ఏప్రిల్ 15వ తేదీన గ్యాంగ్ స్టర్ - పొలిటీషియన్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అజీమ్ ముగ్గురు దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. అయితే హత్య తరువాత అతడికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాఫియా డాన్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడిస్తున్నారు. తాజాగా తన ఆస్తి కోసం 35 ఏళ్లు అతిక్ అహ్మద్, అతడి అనుచరులతో పోరాడిన 50 ఏళ్ల రైతు అయిన రాంకాళి కుష్వాహా కూడా తను అనుభవించిన కష్టాలను మీడియా సంస్థ ‘న్యూస్ 18’తో వివరించారు. 

మరో 15-20 రోజుల్లో మహారాష్ట్ర షిండే ప్రభుత్వం కూలిపోతుంది - ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Latest Videos

ఈ పోరాటంలో ఆమె తన భర్తను కోల్పోయారు. కుమారుడికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. పూర్వీకుల నుంచి తనకు వచ్చిన ఆస్తిని కాపాడుకునేందుకు ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ‘న్యూస్ 18’ కథనం ప్రకారం.. యూపీ ప్రయాగ్ రాజ్ లోని ఝల్వా, సూరజ్ కలి ప్రాంతానికి చెందిన రైతు రాంకాళి కుష్వాహా. ఆమెకు ఝల్వాలోని ఇండియన్ ఆయిల్ డిపో ఎదురుగా ఉన్న వారసత్వంగా వచ్చిన 12 బిగాల భూమి ( సుమారు 3.30 ఎకరాలు) ఉంది. దానిని అమ్మాలని 1989 దశకం చివరిలో అతిక్ మనుషులు ఆమెను సంప్రదించారు. మొదట అభ్యర్థిస్తూనే మాట్లాడారు. కానీ ఆమె కుటుంబ సభ్యులు అమ్మేందుకు ఇష్టపడకపోవడంతో అతిక్ మనుషులు ఆమెను బెదిరించారు. భూమి అమ్మకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 

అయితే అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబ వాతావరణం అంతా ఒక్క సారిగా మారిపోయింది. అప్పటి నుంచి అతీక్ అహ్మద్, అతడి సోదరుడి నుంచి బెదిరింపులు సర్వసాధారణమయ్యాయి. అనేక సార్లు తమ భూమిని అమ్మాలని ఆ కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చేవారు. అయితే అది తమకు ఉన్న ఏకైక ఆధారం అని, తమ పూర్వీకుల గుర్తుగా దానిని ఉంచుకుంటున్నామని ఆ కుటుంబం మొండిగా తెగేసి చెప్పింది.

మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం.. ఒక్కొక్కరిపై రూ.14 లక్షల రివార్డు

‘‘1989 సంవత్సరంలో దగ్గరలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసే నా భర్త బ్రిజ్ మోహన్ కుష్వాహా పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఇది అతిక్ పనే అని అర్థం కావడానికి మాకు ఎక్కువ సమయం పట్టలేదు. దీంతో అతడిపై ఫిర్యాదు చేయడానికి నేను ధూమన్ గంజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. కానీ పోలీసులు నాకు సాయం చేయకపోగా.. నన్ను తోసేశారు.’’అని రాంకాలీ గుర్తు చేసుకున్నారు. 

‘‘అదే ఏడాది 1989లో అతిక్ ఎన్నికల్లో గెలిచి అతిక్ తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత నాకుఫోన్ చేశాడు. నా భర్త ఇక లేడని చెప్పాడు. ఇప్పటికైనా మా 12 బిగాల స్థలాన్ని ఇస్తే తన కుటుంబాన్ని చూసుకుంటానని చెప్పాడు. అతడు అక్కడ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ నేను అప్పటికి కూడా ఒప్పుకోలేదు.’’ అని ఆమె అన్నారు. 

కొంత కాలం తరువాత ఆమె అతికష్టం మీద అతిక్ పై ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించగలిగింది. ‘‘1989 నుంచి 2016 వరకు నాపై, నా కుటుంబ సభ్యులపై అతిక్ మనుషులు దాడి చేసి, భూమిని అప్పగించాలని బలవంతం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ నేను ఈ మాఫియాకు ఒక్క అంగుళం భూమి కూడా ఇవ్వనని, పోరాటం కొనసాగిస్తానని మొండికేశాను. 2016లో అతిక్ అనుచరులు నా ఇంటిపై భీకరంగా దాడి చేశారు. ఈ సమయంలో నా కుమారుడికి తీవ్రంగా బుల్లెట్ గాయాలై హాస్పిటల్ లో చేరాడు. అయితే హాస్పిటల్ లో కూడా అతిక్ బెదిరింపులు కొనసాగాయి.’’ అని ఆమె తెలిపారు. 

తమ సీక్రెట్లు బయటపెడుతాడని అతిక్ అహ్మద్ ను ప్రతిపక్షాలే చంపాయి - యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

‘‘ 2017లో ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం మాఫియారాజ్ ను ఉపేక్షించబోదని అనుకున్నాను. అయితే అసద్ పోలీసు ఎన్ కౌంటర్ లో హతమైనప్పుడు చాలా సంతోషించాను. దాదాపు నా 35 ఏళ్ల న్యాయపోరాటం ముగిసిందని ఊపిరిపీల్చుకున్నాను’’ అని ఆమె చెప్పారు. 

ఇలా రాంకాలి మాత్రమే కాదు.. అనేక మంది అతిక్ చేతిలో తీవ్రంగా హింసకు గురయ్యారు. ప్రయాగ్ రాజ్ లోని చాకియా ప్రాంతంలో ఉన్న అతిక్ ఆఫీసు ముందు హారన్ కొట్టేందుకు కూడా ఎంతో మంది భయపడేవారని రాంకాలి గుర్తు చేశారు. ‘‘ సంసద్ జీ కా దర్బార్ అని పిలిచే అతడి ఆఫీసు ముందు హారన్ కొట్టినవారెందరినో అతిక్ నిర్బంధించేవారు. దీంతో ప్రజలు అటువైపు వెళ్లేందుకే భయపడిపోయేవారు. ఎంత అవసరం ఉన్నా.. వేరే దారి గుండా మాత్రమే వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆ మాఫియా డాన్ చనిపోయాడు. కానీ అతడి పెట్టిన చిత్ర హింసలకు సంబంధించిన టెర్రర్ కథలు మాత్రం ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.’’ అని అమె అన్నారు. కాగా.. అతిక్ చేతిలో బాధపడ్డ, చిత్రహింసలు ఎదుర్కొన్న అతడి ఉగ్రవాదానికి సాక్షిగా నిలిచిన వ్యక్తుల సుదీర్ఘ జాబితాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో రాంకాళి పేరు కూడా ఉంది. 

click me!