అమిత్ షాకు బెదిరింపులు.. పంజాబ్ పోలీసులపై దాడి.. అమృత్ పాల్ సింగ్ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..?

Published : Apr 23, 2023, 02:12 PM IST
అమిత్ షాకు బెదిరింపులు.. పంజాబ్ పోలీసులపై దాడి.. అమృత్ పాల్ సింగ్ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..?

సారాంశం

Amritpal Singh case: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బెదిరింపులు, పంజాబ్ పోలీసులపై దాడి ఇలాంటి ప‌లు ప‌రిణామాల క్ర‌మంలో అరెస్టు నుంచి త‌ప్పుంచుకుంటూ పోలీసుల క‌ళ్లుగ‌ప్పి తిరుగుతున్న ఖ‌లిస్తానీ నాయ‌కుడు అమృత్ పాల్ సింగ్ ను పోలీసులు ఎట్ట‌కేల‌కు అరెస్టు చేశారు. 36 రోజులుగా ప‌రారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్.. వ‌రుస వీడియోలు విడుల చేస్తూ స‌వాల్ విసిరి.. చివ‌ర‌కు పోలీసుల ముందు లొంగిపోయాడ‌ని స‌మాచారం.

Amritpal Singh: ఖ‌లిస్తానీ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ ను మోగా పోలీసులు అరెస్టు చేశారు. మోగాలోని గురుద్వారా నుంచి అమృత్ పాల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 36 రోజులుగా పరారీలో ఉన్నాడు. అమృత్ పాల్ కోసం పంజాబ్ నుంచి నేపాల్ వరకు గాలించారు. అయితే, చివ‌ర‌కు మోగా పోలీసుల ముందు లొంగిపోయాడు. అమృత్ పాల్ సింగ్ కు అరెస్టుకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

1. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బెదిరింపులు

ఫిబ్రవరి 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చంపేస్తానని అమృత్ పాల్ బెదిరించడంతో అత‌ని గురించి వెలుగులోకి వచ్చింది. పంజాబ్ లోని మోగా జిల్లా బుధ్ సింగ్ వాలా గ్రామంలో అమృత్ పాల్ మాట్లాడుతూ ఇందిర కూడా ఇదివ‌ర‌కు అణచివేసేందుకు ప్రయత్నించిందని, ఏం జరిగింది.. ? ఇప్పుడు అమిత్ షా తన కోరిక తీర్చాలంటూ వ్యాఖ్య‌లు చేశారు. అంత‌కుముందు, పంజాబ్ లో ఖలిస్తాన్ మద్దతుదారులపై నిఘా ఉంచామని అమిత్ షా కొద్ది రోజుల క్రితం చెప్పారు. అమిత్ షా వ్యాఖ్యలపై అమృత్ పాల్ ను ప్రశ్నించగా.. "పంజాబ్ లోని ప్రతి చిన్నారి ఖలిస్తాన్ గురించి మాట్లాడుతుందని అమిత్ షాకు చెప్పండి. ఏం చేయాలనుకుంటే అది చేయండి. 500 ఏళ్లుగా మన పూర్వీకులు ఈ భూమిపై తమ రక్తాన్ని చిందించారు. వేళ్ల మీద లెక్కచేయలేని త్యాగాలు చేసేవారు చాలా మందే ఉన్నారు. ఈ భూమికి మనం హక్కుదారులం. ఈ వాదన నుంచి మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు. ఇందిర గానీ, మోడీ గానీ, అమిత్ షా గానీ వారిని తొలగించలేకపోయారు. ప్రపంచం నలుమూలల నుండి సైన్యాలు వస్తాయి, మేము చనిపోతాము, కానీ మేము మా వాదనను వదులుకోము" అంటూ వ్యాఖ్యానించారు. 

2. పోలీస్ స్టేషన్ పై దాడి..

ఫిబ్రవరి 23న తన సన్నిహితుడు లవ్‌ప్రీత్ రక్షించేందుకు వేలాది మంది మద్దతుదారులతో కలిసి పంజాబ్ లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేశాడు. అమృత్ పాల్ మద్దతుదారులు కర్రలు, కత్తులతో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. బరీందర్ సింగ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేశారనే అభియోగాలపై లవ్ ప్రీత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఖలిస్థాన్ దాడిలో ఆరుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారు లవ్ ప్రీత్ ను సులభంగా రక్షించారు. ఆ తర్వాత అమృత్ పాల్ పలు టీవీ చానెళ్లలో ఖలిస్థాన్ కు మద్దతుగా పోరాడతానని బహిరంగంగా ప్రకటించారు. అమృత్ పాల్ ను ఖలిస్థాన్ ఉగ్రవాది భింద్రన్ వాలేతో కూడా పోలుస్తున్నారు. 

3. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పంజాబ్ సీఎం భేటీ

పోలీస్ స్టేషన్ పై దాడి వార్త దేశవ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. ఆ తర్వాత అమృత్ పాల్ ఖలిస్థాన్ మద్దతుదారులకు హీరో అయ్యాడు. మార్చి 2న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. పంజాబ్ భద్రతా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయడానికి సీఆర్పీఎఫ్, దాని ప్రత్యేక అల్లర్ల నిరోధక విభాగానికి చెందిన 1,900 మంది సిబ్బందిని పంజాబ్ కు పంపాలని అమిత్ షా వెంటనే నిర్ణయించారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి స్వయంగా ట్వీట్ ద్వారా తెలియజేశారు.

4. అమృత్ పాల్ అరెస్టుకు పోలీసుల సన్నాహాలు

హోం మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత భగవంత్ మాన్ పంజాబ్ కు తిరిగి వచ్చినప్పుడు, ఆయన డీజీపీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమృత్ పాల్ అరెస్టుకు సన్నాహాలు ప్రారంభించాలని పోలీసులను ఆదేశించారు. అమృత్ పాల్ అరెస్టు తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించకుండా చూడాలని మాన్ గతంలో భావించారు. ఇందుకోసం పంజాబ్ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్య‌లు తీసుకున్నారు. 

5. అమృత్ పాల్ అరెస్టు.. హైకోర్టుకు మ‌ద్ద‌తుదారులు 

పోలీసులు క‌ళ్లుగ‌ప్పి తిరిగిన అమృత్ పాల్ సింగ్ చివ‌ర‌కు పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే, అమృత్ పాల్ ను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ వారిస్ పంజాబ్ దే సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై స్పందించిన పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వం, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. పంజాబ్ ప్రభుత్వంతో కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వం అమృత్ పాల్ ను జలంధర్ నుంచి అక్రమ నిర్బంధంలో ఉంచిందని పిటిషనర్ ఇమ్రాన్ సింగ్ ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu