అటల్ టన్నెల్ ని జాతికంకితమిచ్చిన ప్రధాని మోడీ, ప్రత్యేకతలివే ....

By team teluguFirst Published Oct 3, 2020, 11:30 AM IST
Highlights

ఈ సొరంగ మార్గాన్ని అత్యాధునికమైన సదుపాయాలతో నిర్మించారు. పీర్ పంజాల్ శ్రేణుల్లో సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఈ 9.02 కిలోమీటర్ల సొరంగాన్ని నిర్మించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇందాక కొద్దిసేపటికింద అటల్ టన్నెల్ ని ప్రారంభించి దానిని జాతికి అంకితం చేసారు. హిమాలయాల మధ్య నెలకొన్న హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఈ టన్నెల్ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. 

సంవత్సరంలో దాదాపు ఆరు నెలలపాటు మంచు కురవడం అక్కడ సహజం. ఆ కాలంలో ఆయాప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా స్థంభించిపోతాయి. ఇదే విధంగా లాహూల్, స్పితి లోయలు - మనాలిల మధ్య ఆరు నెలలపాటు రాకపోకలకు మంచు వల్ల అంతరాయం ఏర్పడుతుంది. 

ఈ టన్నెల్ నిర్మాణం వల్ల అక్కడ ఇప్పుడు పూర్తి స్థాయిలో రవాణా సదుపాయం ఏర్పడుతుంది. అంతే కాకుండా... ప్రయాణ దూరం కూడా నాలుగు నుండి 5 గంటల దాకా తగ్గుతుంది. 

సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కూడా హిమాలయాల ప్రాంతంలో ఇలాంటి అల్ వెదర్ రోడ్డు అత్యవసరం. ప్రభుత్వం నిర్మించిన ఈ సొరంగ మార్గం వల్ల అన్ని వేళలా సరిహద్దుల్లోని సైనికులకు అవసరమైన సామాగ్రిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తరలించేందుకు వీలుంటుంది. 

ఈ సొరంగ మార్గాన్ని అత్యాధునికమైన సదుపాయాలతో నిర్మించారు. పీర్ పంజాల్ శ్రేణుల్లో సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఈ 9.02 కిలోమీటర్ల సొరంగాన్ని నిర్మించారు. దక్షణ ద్వారం మనాలి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటె.... ఉత్తర ద్వారం సిస్సు గ్రామానికి దగ్గర్లో ఉంది. 

గుర్రపు నాడ ఆకారంలో ఉండే ఈ టన్నెల్ 8 మీటర్ల వెడల్పు తో డబల్ లేన్ లో నిర్మించబడింది. ప్రతిరోజు 3000 కార్లు, 1500 ట్రక్కులు ప్రయాణించేందుకు వీలుగా ఈ టన్నెల్ ని నిర్మించారు. ఇందులో వాహనాలు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. 

అత్యాధునికమైన అగ్నిమాపక వ్యవస్థ, గాలి వెలుతురు కోసం వెంటిలేషన్ వ్యవస్థ, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డాయి. దాదాపు 3,300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ టన్నెల్ ని నిర్మించారు. ఇందులో ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యాన్ని, ప్రతి 60 మీటర్లకు అగ్నిమాపక సిలిండర్లను, ప్రతి 500 మీటర్లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేసినట్టు తెలియవస్తుంది. 

click me!